Breaking News

విశాఖ‌ప‌ట్నం లో రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో రైల్ ప్రాజెక్ట్

-కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తాం
-గ‌త ప్ర‌భుత్వం విశాఖ‌,విజ‌య‌వాడ‌కు మెట్రో రైల్ రాకుండా క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విశాఖ‌ప‌ట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కు సంబంధించి స‌మ‌గ్ర ర‌వాణా ప్ర‌ణాళిక‌(సీఎంపి)సిద్దం చేసిన‌ట్లు పుర‌పాల‌క మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ స్ప‌ష్టం చేసారు…ఈ ప్ర‌ణాళిక‌ను ఇప్ప‌టికే కేంద్ర ప్ర‌భుత్వానికి పంపించామ‌న్నారు..కేంద్రం నుంచి అనుమ‌తి రాగానే ప్రాజెక్ట్ పై ముందుకెళ్తామ‌న్నారు..అసెంబ్లీలో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో విశాఖ‌ప‌ట్నంకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ప‌ల్లా శ్రీనివాస‌రావు,పీజీవీఆర్ నాయుడు,వెల‌గ‌పూడి రామకృష్ణ బాబు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి స‌మాధాన‌మిచ్చారు..

2014 విభ‌జ‌న చ‌ట్టంలోని 13వ షెడ్యూల్ ఐటం 12 ప్ర‌కారం విజ‌య‌వాడ‌,విశాఖ‌కు మెట్రో రైలు పై ఫీజిబులిటీ రిపోర్ట్ ఇవ్వాల‌ని పొందుప‌రిచారు.దీని ప్ర‌కారం 2014లో డీపీఆర్ సిద్దం చేయాల‌ని ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్ కు నాటి టీడీపీ ప్ర‌భుత్వం బాధ్య‌త‌లు అప్ప‌గించింది… ఆ త‌ర్వాత 2015లోనే డీఎంఆర్సీ ఏపీ ప్ర‌భుత్వానికి నివేదిక అందించింది…విశాఖ‌ప‌ట్నంకు సంబంధించి 42.5 కిమీల నెట్ వ‌ర్క్ తో మూడు కారిడార్ల‌తో మీడియం మెట్రో ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చారు.2019 ఏప్రిల్ లో టెండ‌ర్లు పిల‌వ‌గా కొన్ని కంపెనీలు బిడ్లు కూడా దాఖ‌లు చేసాయి..అయితే ఆ త‌ర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్ర‌భుత్వం టెండ‌ర్లు ఖ‌రారు చేసి ఉంటే విశాఖ‌ప‌ట్నంతో పాటు విజ‌య‌వాడకు మెట్రో రైలు వ‌చ్చి ఉండేది..కానీ విశాఖ‌ప‌ట్నంలో భోగాపురం వ‌ర‌కూ పొడిగింపు సాకుతో ప్రాజెక్ట్ ను పెండింగ్ లో పెట్టేసార‌ని మంత్రి నారాయ‌ణ తెలిపారు.తిరిగి 2020 మార్చి 19 వ తేదీన గుర్గాంకు చెందిన వీఎంటీసీ అనే కంపెనీకి విశాఖ మెట్రో డీపీఆర్ బాధ్య‌త‌లు అప్ప‌గించ‌గా….మొత్తం 76.9కిమీతో 14,300 కోట్ల ఖ‌ర్చుతో నాలుగు కారిడార్ల‌లో ఏర్పాటుకు డీపీఆర్ ఇచ్చింద‌న్నారు…2021 ఏప్రిల్ లోనే డీపీఆర్ ఇచ్చిన‌ప్ప‌టికీ 2023 డిసెంబ‌ర్ 15వ తేదీ వ‌ర‌కూ వైసీపీ ప్ర‌భుత్వం ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌న్నారు నారాయ‌ణ‌..

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత క‌ల‌క‌త్తా మెట్రో రైల్ త‌ర‌హాలో వంద‌శాతం కేంద్ర‌ప్ర‌భుత్వం భ‌రించేలా రైల్వే శాఖ‌కు అప్ప‌గించేలా కేంద్రం ముందు ప్ర‌తిపాద‌న ఉంచామ‌న్నారు.దీనికి సంబంధించి స్వ‌యంగా ఢిల్లీ వెళ్లి కేంద్ర‌మంత్రికి లేఖ ఇవ్వ‌డంతో పాటు సీఎం చంద్ర‌బాబు కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాసార‌ని చెప్పారు.రెండు ద‌శ‌ల్లో నాలుగు కారిడార్ల‌లో మెట్రో ఏర్పాటుకు ప్ర‌తిపాద‌న‌లు ఇచ్చామ‌న్నారు.మొద‌టి ద‌శ‌లో 46.23 కిమీ మేర మూడు కారిడార్ల‌లో నిర్మాణం చేస్తామ‌న్నారు..మొద‌టి కారిడార్ ను స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది జంక్ష‌న్ వ‌ర‌కూ 34.4 కిమీ మేర రెండో కారిడార్ లో గురుద్వార నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వ‌ర‌కూ 5.07 కిమీ మేర మూడో కారిడార్ లో తాటిచెట్ల పాలెం నుంచి చిన వాల్తేరు వ‌ర‌కూ 6.75 కిమీ మేర ప్రాజెక్ట్ నిర్మాణం చేప‌ట్టేలా ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసామ‌న్నారు.మొత్తంగా 46.23 కిమీ మేర 42 స్టేష‌న్ల‌తో నిర్మించే ప్రాజెక్ట్ కు 11,498 కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచానా వేసామ‌న్నారు.ఇక రెండో ద‌శ‌లో కొమ్మాది జంక్ష‌న్ నుంచి భోగాపురం ఎయిర్ పోర్ట్ వ‌ర‌కూ 30.67 కిమీ మేర 12 స్టేష‌న్ల తో మెట్రో నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు సిద్దం చేసామ‌న్నారు మంత్రి నారాయ‌ణ‌.అయితే విశాఖ మెట్రో కారిడార్ వెళ్లే మార్గంలో ఎక్కువ క్రాసింగ్స్ వ‌స్తున్న అంశాన్ని కూట‌మి నేతలు ప్ర‌భుత్వం దృష్టికి తీసుకొచ్చార‌న్నారు మంత్రి….ప్ర‌తి క్రాసింగ్ వ‌ద్ద ట్రాఫిక్ జామ్ కాకుండా కార్ షెడ్,ఎండాడ‌,హ‌నుమంతుని వాక‌,మ‌ద్దిల‌పాలెం, విప్రో జంక్ష‌న్, గురుద్వారా, అక్క‌య్య‌పాలెం, తాటిచెట్ల‌పాలెం, గాజువాక‌,స్టీల్ ప్లాంట్ జంక్ష‌న్ ల వ‌ద్ద టూ లెవ‌ల్ మెట్రో,ఫ్లై ఓవ‌ర్ లు నిర్మించే ప్ర‌తిపాద‌న కూడా చేస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు.

Check Also

అవగాహన ద్వారానే క్యాన్సర్ వ్యాధిని అరికట్టవచ్చు

-వరదయ్యపాలెం మత్తెరిమిట్ట గ్రామం క్యాన్సర్ స్క్రీనింగ్ సర్వే కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్ వరదయ్యపాలెం, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *