Breaking News

ఏఈఎల్సి, ఆర్సిఎం సంస్థలకు ప్రత్యేక అభినందనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరవాసుల చిరకాల వాంఛ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణంకు అనుమతులు రావడం సంతోషమని, నిర్మాణానికి సంపూర్ణంగా సహకరిస్తామన్న ఏఈఎల్సి, ఆర్సిఎం సంస్థలకు ప్రత్యేక అభినందనలు తెలిపుతున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ అన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని కమిషనర్ చాంబర్ లో ఏఈఎల్సి, ఆర్సిఎం ప్రతినిధులతో సమావేశం జరిగింది.
తొలుత ఆర్&బి అధికారులు ఆర్ఓబి నిర్మాణ ప్లాన్ ని, జిఎంసి పట్టణ ప్రణాలిక అధికారులు ప్రభావిత భవనాల వివరాలు, జిఎంసి నుండి అందించే నష్ట పరిహారం వివరాలను వివరించారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న శంకర్ విలాస్ ఆర్ఓబి కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆమోదం తెలిపినందున నిర్మాణం కోసం రోడ్ విస్తరణ 120 అడుగులకు చేపట్టనున్నామన్నారు. ఇప్పటికే అరండల్ పేట, బ్రాడిపేట వైపు ప్రభావిత భవనాల యజమానులతో సమావేశమయ్యామన్నారు. ఆర్ఓబి నిర్మాణంకు ఏఈఎల్సి, ఆర్సిఎం ప్రతినిధులు సహకరిస్తామని ముందుకు రావడం అభినందనీయమని, ఆయా సంస్థలకు చట్ట పరంగా అందాల్సిన నష్ట పరిహారాలను త్వరితగతిన అందించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఏఈఎల్సి, ఆర్సిఎం ప్రతినిధులు మాట్లాడుతూ ఆర్ఓబి నిర్మాణంకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. భవనాలకు తగిన నష్ట పరిహారం వేగంగా అందేలా చూడాలని, తొలుత భవణాలు ఏ మేరకు ప్రభావితం అవుతాయో మార్కింగ్ చేయాలని కమిషనర్ ని కోరారు.
సమావేశం సిటి ప్లానర్ రాంబాబు, ఏసిపి రెహ్మాన్, సిస్టర్ ఇన్యాసమ్మ, డాక్టర్ ఆని, (సెయింట్ జోసఫ్), డాక్టర్ కెఎంఎల్ శాస్త్రి, కె.మోసెస్ ఆర్నాల్డ్ (ఏఈఎల్సి), డాక్టర్ కనపాల జోసఫ్ (ఏసి కాలేజి), టి.రవి మోహన్ రెడ్డి (సెయింట్ జోసఫ్ హాస్పిటల్), టి.రితేష్ (జెఎంజె) తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజన్‘కు – విధ్వంసానికి తేడా ప్రజలు తెలుసుకోవాలి… : రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గత 5 ఏళ్ళుగా టిడ్కో ఇళ్ళను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే అభిప్రాయం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *