Breaking News

Tag Archives: amaravathi

రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవల పోర్టల్ ప్రారంభం

-ఆన్ లైన్ సేవల పోర్టల్ ను ప్రారంభించిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో ఆన్ లైన్ సేవలను ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. మంగళవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ వద్ద ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ప్రధాన దేవాలయాల ఆన్ లైన్ సేవల పోర్టల్ aptemples.gov.in ను ఆయన ప్రారంభించారు. తదుపరి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి …

Read More »

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి గా కోలగట్ల వీరభద్రస్వామి ఏకగ్రీవంగా ఎంపిక

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తేనీటి విరామం తదుపరి మధ్యాహ్నం 12.00 గంటలకు సభ సమావేశమై న వెంటనే శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ఉపసభాపతి పదవికి  కోలగట్ల వీరభద్రస్వామి పేరు ఒక్కటే నామినేట్ చేయబడి నందున వారిని ఉపసభాపతి గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సభాపతి ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాటు పలువురు మంత్రులు, శాసన సభ్యులు. కోలగట్ల వీరభద్ర స్వామిని పోడియం పైనున్న స్పీకర్ సీటు వద్దకు తీసుకువచ్చి గౌరవ ప్రదంగా వారిని ఆ సీట్లో …

Read More »

శ్రీశైలం దసరా నవరాత్రుల ఉత్సవాలకు సీఎం వైఎస్‌ జగన్‌కు ఆహ్వానం…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జునస్వామి దసరా నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా శాససనభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఉపముఖ్యమంత్రి (దేవాదాయ, ధర్మాదాయ శాఖ) కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ ఎం హరిజవహర్‌లాల్, శ్రీశైలం దేవస్ధానం ఈవో లవన్న, దేవస్ధానం ఛైర్మన్‌ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, సభ్యులు కలిశారు. ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌కు వేద పండితులు వేద ఆశీర్వచనంతో పాటు శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం సీఎం జగన్‌ను శ్రీశైలం శ్రీభ్రమరాంబ …

Read More »

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో పరిశ్రమలకు రాచబాట : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి

-త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు -రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటయ్యే పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన -తొలుత ఛైర్మన్ సొంత జిల్లా అనంతపురం జిల్లా నుంచి మొదలయ్యేలా షెడ్యూల్ ప్లాన్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా మరింత పురోగమిస్తోందని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటించనున్నట్లు స్పష్టం చేశారు. రూ.50 కోట్ల లోపు పెట్టుబడులతో ఏర్పాటవుతోన్న పరిశ్రమలకు భూమి పూజ, శంకుస్థాపన చేసే దిశగా ఏపీఐఐసీ అడుగులు వేస్తున్నట్లు పేర్కొన్నారు. …

Read More »

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు

-అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు -సాధారణ భక్తులకు ఎటు వంటి ఇబ్బందులు కలుగ కుండా తగు జాగ్రత్తలు -ఉపముఖ్యమంత్రి, దేవాదాయ,ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త: బెజవాడ ఇంద్రకీలాద్రి పై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లను చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లో పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తదుపరి పాత్రికేయులతో ఆయన …

Read More »

ఆనాడు పాదయాత్రలో జగన్ ఇచ్చిన హామీని నేరవేర్చారు….

-సచివాలయంలో గ్రానైట్ పరిశ్రమల నిర్వాహకులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష – గ్రానైట్ పరిశ్రమను ఆదుకునేందుకే స్లాబ్ విధానం – స్లాబ్ విధానం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 7వేల యూనిట్లకు మేలు – సమగ్ర భూసర్వే కోసం గ్రానైట్ పరిశ్రమ నుంచి సర్వేరాళ్ళను అందించాలి – వచ్చే డిసెంబర్ నాటికి 30 లక్షల సర్వే రాళ్ళు అవసరం – సర్వే రాళ్ళ కోసం ఎపిఎండిసి సొంత యూనిట్లును ఏర్పాటు చేసుకుంది – ఇంకా డిమాండ్ మేరకు సర్వే రాళ్ళు కావాల్సి ఉన్నాయి – వాటిని …

Read More »

ఎన్ని అవాంతరాలు ఎదురైనా పోరాటం ఆపేది లేదు… : అమరావతి రైతులు

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త : ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న మహాపాదయాత్ర 2.0 నాలుగో రోజుకు చేరింది. గుంటూరు జిల్లా పెదరావూరు నుంచి ఇవాళ పాదయాత్ర ప్రారంభమైంది. రాజధాని రైతులతోపాటు స్థానికులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారు. తొలుత పెదరావూరులో రైతులు బసచేసిన ప్రాంతం వద్ద పూజలు నిర్వహించారు. ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం పాదయాత్ర మొదలు కాగా.. దారి పొడవునా ఎక్కడికక్కడ ప్రజలు ఘన …

Read More »

2023 ఏప్రిల్ 14 న 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ

-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న 125 అడుగుల డా.బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. బుధవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా విజయవాడ నడిబొడ్డున ఈ విగ్రహ ప్రతిష్టాపనకు ఏర్పాటు చేయడం జరుగుచున్నదన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో ప్రత్యేక …

Read More »

ఉద్యోగ నియామకాల్లో గిరిజనుల రిజర్వేషన్ పటిష్టంగా అమలు పర్చాలి

-బొర్రాగుహల ఆదాయంలో 20% బొర్రా గ్రామపంచాయితీకి కేటాయించాలి -రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు కేటాయించిన 6 శాతం రిజర్వేషన్ విధాన్ని పటిష్టంగా అమలు పర్చాలని రాష్ట్ర ఎస్.టి. కమిషన్ చైర్మన్ డా.కుంభా రవిబాబు పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఎస్.టి.కమిషన్ చైర్మన్ అద్యక్షతన బుధవారం అమరావతి సచివాలయం మూడో బ్లాక్ లో పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్బంగా చైర్మన్ కుంభా రవిబాబు మాట్లాడుతూ …

Read More »

వ్యోమగామి అవ్వాలనే కల సాకారానికి సి.ఎం.ఆర్థిక సహాయం

-ప్రభుత్వపరంగా రూ.50లక్షల ఆర్థిక సహాయ చెక్కును అందజేసిన సమాచార శాఖ మంత్రి -ఆర్థిక సహాయం అందజేసిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెల్పిన దంగేటి జాహ్నవి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన దంగేటి జాహ్నవి వ్యోమగామి అవ్వాలనే కలను సాకారం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని మంజూరు చేశారు. రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మరియు సినిమాటోగ్రఫీ మంత్రి సిహెచ్. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ బుధవారం …

Read More »