Breaking News

Tag Archives: amaravathi

ఒలింపిక్స్ పతకంతో హాకీ క్రీడకు పునర్ వైభవం

-చిరకాల స్వప్నం నెరవేర్చిన క్రీడాకారులకు శుభాకాంక్షలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నాలుగు దశాబ్దాల తరవాత మన హాకీ క్రీడాకారుల బృందం ఒలింపిక్స్ లో దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. మన జాతీయ క్రీడ హాకీలో ఒలింపిక్స్ పతకం గెలుచుకోవాలని క్రీడాభిమానులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్ లో మన హాకీ జట్టు కాంస్యం గెలుచుకొని క్రీడాభిమానుల కలను నెరవేర్చింది. మన్ ప్రీత్ సింగ్ నాయకత్వంలోని హాకీ బృందానికి నా తరఫున, …

Read More »

పాఠశాలల ఆధునికీకరణలో పెను విప్లవం-మన బడి నాడు నేడు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాలను ఒక పవిత్ర దేవాలయంగా భావించి అందులో చదివే విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని అకుంటిత దీక్షతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి, మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా స్కూల్స్ లో పరీక్షా ఫలితాలను మెరుగుపరచడం, బడి బయట విద్యార్థుల సంఖ్యను తగ్గించి వారిని స్కూల్స్ లో చేర్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయం. ప్రభుత్వం విద్యా రంగంలో చేపట్టిన విప్లవాత్మక కార్యక్రమాల వల్ల ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 4 లక్షల వరకు అడ్మిషన్లు పెరిగాయి. …

Read More »

స్టేట్ లిటిగేషన్ పాలసీని సమర్థ వంతంగా అమలుచేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం…

-ఈ పాలసీని సమన్వయం,టైం బౌండ్ విధానంలో నిర్వహిస్తే కోర్టులపై ప్రభుత్వ లిటీగేషన్ల భారం తగ్గుతుంది… -ఎపి ఆన్ లైన్ లీగల్ కేసు మేనేజ్మెంట్ సిస్టమ్ (APOLCMS) ప్రవేశ పెట్టడం ద్వారా వివిధ కేసుల డేటాబేస్ నిర్వహణకు అవకాశం… -ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతనంగా తీసుకురానున్న స్టేట్ వ్యాజ్యం (Litigation) పాలసీని సమర్థ వంతంగా అమలు చేస్తే జాప్యం లేకుండా కేసులు సత్వర పరిష్కారానికి అవకాశం ఉంటుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ …

Read More »

పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పెళ్లిళ్ల సీజన్‌లో కళ్యాణ మండపాలు దొరకడమే కష్టం. దొరికినా సామాన్యుడికి అందుబాటులో లేని అడ్వాన్సులు. కానీ లలిత రైస్ ఇండస్ట్రీస్ అధినేతల్లో ఒకరైన మట్టె శ్రీనివాస్ సుమారు రూ.4 కోట్ల వ్యయంతో సెంట్రల్ ఎయిర్ కండీషన్డ్ కళ్యాణ మండపాన్ని అన్నవరం దేవస్థానంలో ఏర్పాటు చేశారు. ఈ కళ్యాణ మండపంలో ఒక్క రూపాయి కూడా చెల్లించకుండానే తమ పిల్లల పెళ్లిళ్లు చేసుకోవచ్చు. ఇది పేద వారి కోసం పెద్ద మనసుతో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక. అన్నవరం దేవస్థానంలో …

Read More »