రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వారి కార్యాలయానికి చెందిన అధికారులు, సిబ్బంది ఉత్తమ సేవలకుగాను ప్రశంసించి ధ్రువ పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె. లక్ష్మీ నారాయణ, డివిజనల్ పౌర సంబంధాల అధికారి ఎం. లక్ష్మణా చార్యులు, సీనియర్ అసిస్టెంట్ ఎం. కృష్ణ వేణి, డ్రైవర్ బి. వెంకట రమణలు జిల్లా కలెక్టర్ మేఘా స్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ అధికారి, ఉద్యోగి …
Read More »Tag Archives: Rājamahēndravaraṁ
రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో 77వ గణతంత్ర దినోత్సవం
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా కలెక్టర్ ఆఫీస్ వారు రాజమహేంద్రవరం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఉత్సవాలలో జరిగిన వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన పోటీలలో రాజమహేంద్రవరం టౌన్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నక్కపల్లి శామ్యూల్ ఆధ్వర్యంలో తయారుచేయబడిన తూర్పు గోదావరి సర్కిల్ విద్యుత్ శకటం మొదటి స్థానం గెలుపొందింది. గత మూడు దఫాలుగా మొదటి స్థానం గెలుచుకోవడం విద్యుత్ సిబ్బంది యొక్క పట్టుదలని సూపరింటెండింగ్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ అభినందించారు.
Read More »జనవరి 30, 31 తేదీలలో ఏలూరులో “కోకో కన్క్లేవ్ – 2026”
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో “కోకో కన్క్లేవ్ – 2026” కార్యక్రమాన్ని ఈ నెల జనవరి 30 మరియు 31 తేదీలలో ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు ఏలూరు నగరంలోని బాలాజీ గార్డెన్స్ ఫంక్షన్ హాల్, చింతలపూడి రోడ్ నందు నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యాన అధికారి ఎన్. మల్లికార్జున రావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కన్క్లేవ్‌లో కోకో పంటకు సంబంధించిన నాణ్యత మెరుగుదల, పంట కోత అనంతర …
Read More »నేడే 16వ జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు
-ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ ఎన్నికల కమిషన్ స్థాపన దినోత్సవాన్ని పురస్కరించుకొని 16వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని ఈ నెల 25వ తేదీన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఇంచార్జి జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి వై. మేఘా స్వరూప్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం రాజమహేంద్రవరం వెంకటేశ్వర ఆనం కళా కేంద్రం లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఓటరు అవగాహన కార్యక్రమాలు, …
Read More »ఘనంగా జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలు
-జనవరి 26న ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరణ -“ప్రజలకు జిల్లా ప్రగతిపై సందేశం ఇవ్వనున్న ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘా స్వరూప్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి 26న రాజమహేంద్రవరం లోని స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జిల్లా స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్. కృష్ణ నాయక్, అదనపు ఎస్పీ ఎల్. చెంచు రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ …
Read More »ఏపీపీఎస్సీ రాత పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు డిఆర్వో సీతారామ మూర్తి
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిర్వహిస్తున్న 17 నియామక నోటిఫికేషన్లకు సంబంధించిన ఆఫ్‌లైన్ (OMR ఆధారిత – ఆబ్జెక్టివ్ టైప్) రాత పరీక్షలు 27.01.2026 ఉదయం నుంచి 31.01.2026 ఉదయం వరకు తూర్పు గోదావరి జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించనున్న నేపథ్యంలో, పరీక్షలు ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు ఇంచార్జి జిల్లా కలెక్టర్ వై. మేఘ స్వరూప్ వారి ఆదేశాల మేరకు సంబంధిత శాఖలకు విధులు కేటాయించారు. ఈ మేరకు జిల్లా రెవెన్యూ అధికారి టి. …
Read More »రాజమహేంద్రవరం లో “జాతీయ బాలిక దినోత్సవం”
రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త : జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం వారి ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం లోని శ్రీకందుకూరి వీరేశలింగం (SKVT) హై స్కూల్ నందు “జాతీయ బాలిక దినోత్సవం” కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి కె. వాసుదేవరావు జాతీయ బాలిక దినోత్సవం యొక్క ప్రాధాన్యత, బాలికల విద్య యొక్క అవసరాన్ని వివరించారు. అలాగే ప్రభుత్వం బాలికల కోసం …
Read More »అనధికార లేఅవుట్‌లపై కఠిన చర్యలు
-పంచాయతీల్లో వారం రోజుల్లో గుర్తింపు –నోటీసులు జారీ -రుడా చైర్ పర్సన్ బొడ్డు వెంకట రమణ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : RUDA చైర్‌పర్సన్ బొడ్డు వెంకట రమణ చౌదరి ఆధ్వర్యంలో, వైస్‌చైర్‌పర్సన్ వై. మేఘ స్వరూప్, ఐఏఎస్ సూచనల మేరకు గురువారం రుడా కాన్ఫరెన్స్ హాల్‌లో RUDA పరిధిలోని గ్రామ పంచాయతీ కార్యదర్శులతో లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS), బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ (BPS) అమలుపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనధికార లేఅవుట్‌లు, కట్టడాలపై అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ …
Read More »APERC ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొన్న ప్రజా సంఘాల జేఏసీ ప్రతినిధులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం (22.01.2026న) విజయవాడలో నిర్వహించిన ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (APERC) ప్రజాభిప్రాయ సేకరణ సమావేశానికి, తూర్పుగోదావరి సర్కిల్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ జె.టి. రామరావు హాజరై పలు ప్రజాప్రయోజన అంశాలపై తన అభిప్రాయాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సర్కిల్ నుంచి వ్యక్తం చేయడం జరిగిందనీ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె. తిలక్ కుమార్ తెలియ చేశారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ జె.టి. రామరావు గోదావరి పుష్కరాల సందర్భంగా …
Read More »వాహనాలపై ‘రోడ్డు భద్రతా సెస్’ అమలు
-జనవరి 13 నుంచి కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కు వర్తింపు – జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను చట్టం, 1963ను సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13.01.2026న “ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్ను (సవరణ) ఆర్డినెన్స్–2026” ను జారీ చేసినట్లు జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఆర్డినెన్స్ వెంటనే జనవరి 13 నుంచి అమలులోకి వచ్చిందనీ తూర్పు గోదావరి జిల్లా వాహన వినియోగదారులకు ఈ …
Read More »
Prajavartha Online Telugu News