Breaking News

Tag Archives: rajamandri

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

-తుది ఓటరు జాబితా పై వొచ్చిన అభ్యంతరాలు పరిష్కరించడం జరుగుతుంది -నియోజక వర్గ స్థాయి చర్యలు తీసుకోవడం జరుగుతోంది -డి ఆర్వో జి. నరసింహులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 22 న ప్రకటించిన 2024 ఎస్ యస్ ఆర్ తుది ఓటరు జాబితా లో దొర్లిన తప్పులను సరిదిద్ది చర్యలు తీసుకోవడం జరుగుతోందని జీల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ లో రాజకీయ పార్టీలతో డి ఆర్వో జి. నరసింహులు సమావేశం నిర్వహించారు. ఈ …

Read More »

ఘనంగా ప్రారంభమైన ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు

-ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్, ఎంపి, క్రీడా అంబాసిడర్లు -బ్యాట్ పట్టి ఆకట్టుకున్న కలక్టర్, జేసీ, మునిసిపల్ కమిషనర్ -రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నేటి ఆధునిక కాలంలో యువత క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని , తల్లి తండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల్ని ప్రోత్సహించడం చాలా ముఖ్యం అని కలక్టర్ కే. మాధవీలత, ఎంపి మార్గనీ భరత్ రామ్ లు పేర్కొన్నారు. స్ధానిక ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఆడుదాం ఆంధ్రా జిల్లా స్థాయి క్రీడలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ సంధర్భంగా జిల్లా …

Read More »

కులగణన సర్వే ఫిబ్రవరి 4 వరకు పెంపు

-ఇప్పటివరకు పూర్తి అయిన 88.17% కుటుంబాల సర్వే -జేసీ ఎన్. తేజ్ భరత్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా పరిధిలో నూరు శాతం కులగణన నిర్దేశించిన సమయంలో పూర్తి చెయ్యాలని, ఇప్పటికే 88.17 శాతం పూర్తి చేశారని మిగిలిన గృహ ల కులగణన సర్వే కార్యచరణ లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ నుంచీ కులగణన, ఆడుదాం ఆంధ్రా, ఓటర్ల తుది జాబితా, హౌస్ సైట్స్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ …

Read More »

లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ హై లెవెల్ మీటింగ్

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : సోమవారము తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయస్థాన ఆవరణలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ గంధం సునీత పర్మనెంట్ లోక్ అదాలత్ ఫర్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ (PLAPUS) హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వివిధ ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలు అధికారులు మరియు ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థల …

Read More »

31న నన్నయ యూనివర్సిటీ స్నాతకోత్సవం

-విశ్వవిద్యాలయంలో విద్యాపరమైన అతిపెద్ద పండుగ స్నాతకోత్సవం -ముఖ్య అతిథిగా గవర్నర్ అబ్దుల్ నజీర్ -కలెక్టర్ మాధవీలత రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : నన్నయ యూనివర్సిటీ 13 , 14 , 15 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటన ను అన్ని శాఖలు సమన్వయం చేసుకోవడం ద్వారా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం గైట్ కళాశాల, నన్నయ్య యూనివర్సిటీ లో అధికారులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య …

Read More »

ఫిబ్రవరి 9 , 16 తేదీల్లో నిర్వహించే నులిపురుగుల నివారణ (డి వార్మింగ్ డే) విజయవంతం చేయాలి

-19 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పక నులిపురుగు నివారణ మందు అందచెయ్యలి -ఆమేరకు వైద్యుల సలహా మేరకు తీసుకోవాలి. -ఉపాధ్యాయులు, వైద్య బృందం విద్యార్థులను సమీకరించాలి. -క్షేత్ర స్థాయిలో డి ఎల్ డివో లు సమన్వయ పరచాలి -కలెక్టరు డా. మాధవీలత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగు నివారణ డి వార్మింగ్ ఎంతో అవసరం అని , ఆదిశగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇతర శాఖలతో సమన్వయం కోసం కార్యాచరణను అమలు చేయాలని జిల్లా కలెక్టరు …

Read More »

జేసీ సూచనలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ట్రెజరీ స్ట్రాంగ్ రూం లో ఉన్న వివిధ కార్యాలయాలకు చెందిన 34 ఆర్టికల్స్ ఉపసంహరించు కోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్, స్ట్రాంగ్ రూం పర్యవేక్షణ జిల్లా నోడల్ అధికారి  ఎన్. తేజ్ భరత్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ లో సంబంధిత శాఖల అధికారులకు ఆమేరకు జేసీ సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ, దీర్ఘ కాలికంగా జిల్లా పరిధిలోని 15 శాఖలకు చెందిన 79 ఆర్టికల్స్ స్ట్రాంగ్ రూం లో …

Read More »

అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన నాణ్యతతో కూడిన పరిష్కరించాలని కె.ఆర్.సి డివిజన్ తహసీల్దార్ డి సుగుణ అన్నారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన స్పందనలో ఆర్డీవో తరపున కె.ఆర్.సి. సబ్ కలెక్టర్ కార్యాలయం, రాజమహేంద్రవరం తహసీల్దార్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా డి సుగుణ ప్రజల వచ్చిన పది అర్జీలను స్వీకరించారు. ఈరోజు రెవిన్యూ, విద్యుత్, డిఎం.అండ్.హెచ్.ఓ, మున్సిపల్, ఇరిగేషన్, డ్రైనేజీ పైపులైను వేయవలసిందిగా కోరుట తదితర అంశాలకు సంబంధిచి …

Read More »

క్షయ రహిత జిల్లాగా తీర్చి దిద్దుదాం

-క్షయ బాధితుల పట్ల వివక్ష వద్దు -“స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” కార్యక్రమాలు – కలెక్టర్ మాధవీలత రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త : జనవరి 30 నుంచి ఫిబ్రవరి 13 వరకు క్షయ వ్యాధి నిర్మూలన “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” పై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో “స్పర్శ అవగాహన పక్షోత్సవాలు” గొడప్రతులను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జిల్లాను క్షయ రహిత జిల్లాగా రూపుదిద్దేందుకు ప్రతి ఒక్కరినీ …

Read More »

నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం”

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నల్సా వారిచే ప్రారంభించబడిన “యువతను పునరుద్ధరించడం” పేరుతో పాన్- ఇండియా కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కె. ప్రత్యూష కుమారి ఆదివారం రాజమహేంద్రవరం కేంద్ర కారాగార మరియు మహిళా కారాగారాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ప్రత్యూష కుమారి మాట్లాడుతూ జైళ్లలో ఉన్న చట్టంతో విభేదించబడిన బాలురు మరియు బాలికలను గుర్తించి, న్యాయస్థానాల ముందు వారి బాల్యత్వాన్ని నిరూపించుకోవడానికి అవసరమైన చట్టపరమైన సహాయాన్ని అందించే లక్ష్యంతో …

Read More »