Breaking News

Tag Archives: rajamandri

పిజి ఆర్ ఎస్ కు పెద్ద ఎత్తున పరిష్కారం కోసం అర్జీలు

-ప్రీ ఆడిట్ జరపకుండా అర్జిల పరిష్కార విధానం -క్షేత్ర స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు -సూపర్ జీ ఎస్ టి పోస్టర్ ఆవిష్కరణ -కలెక్టర్ కీర్తి చేకూరి, జేసి వై మేఘ స్వరూప్ తదితరులు రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : అర్జీల పరిష్కారం కోసం వొచ్చే అర్జీదారులతో నేరుగా మాట్లాడి మాత్రమే , వాటిని ముగింపు చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులు ఆదేశించారు. సోమవారం బొమ్మూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక–గ్రీవెన్స్ కార్యక్రమంలో కలెక్టర్ …

Read More »

కూటమి ప్రభుత్వం సంక్షేమం – అభివృద్ధి పట్ల అంకితభావం కలిగి ఉంది

– రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజమండ్రి రూరల్, కడియం మండలం కడియం గ్రామంలో నాబార్డ్ నిధులతో రూ.2 కోట్లు 60 లక్షల వ్యయంతో కడియం నుండి జేగురుపాడు వరకు నిర్మించబడనున్న కొత్త కెనాల్ రోడ్ నిర్మాణ పనుల శిలాఫలకాన్ని సోమవారం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ – కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ పథకాలు …

Read More »

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి వసతి గృహాల పరిశీలన

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : సోమవారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి ఎన్. శ్రీలక్ష్మి గారు ఉమెన్స్ కాలేజీ సమీపంలోని బాలికాసదానం గవర్నమెంట్ చిల్డ్రన్ వసతి గృహాన్ని, అలాగే బాలాజీపేటలోని ఏకలవ్య చిల్డ్రన్ ఫర్ బాయ్స్ వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బాలికాసదానంలో విద్యార్థినులతో మాట్లాడిన ఆమె మంచి–చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించారు. పిల్లల అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని, మోసపూరితంగా వారిని అక్రమ కార్యకలాపాలకు …

Read More »

హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నాతి బుజ్జి బాధ్యతల స్వీకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గండేపల్లి మండల ఎంపీడీవోగా, అనంతరం ఏలూరు జిల్లా నీటి యాజమాన్య సంస్థ (DWMA)లో డిఎల్డిఓగా పదోన్నతి పొందిన శ్రీమతి నాతి బుజ్జి సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా సోమవారం పదవిని బాధ్యతలు స్వీకరించారు. ఈ నియామకం డిప్యూటేషన్ ఆధారంగా జరిగిందని, హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. శివ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చెయ్యడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు, హౌసింగ్ శాఖ సిబ్బంది శ్రీమతి నాతి బుజ్జి గారిని అభినందించారు. …

Read More »

నానో ఎరువుల వినియోగం పై రైతులకు అవగాహన

-అభ్యుదయ రైతుకు సన్మానం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : నానో ఎరువుల వినియోగం పై విస్తృత ప్రచారం, ఉత్పత్తుల ప్రదర్శన మరియు అవగాహన ముఖ్యమని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవ రావు పేర్కొన్నారు. సోమవారం జరిగిన పీజీఆర్‌ఎస్ గ్రీవెన్స్ సమావేశంలో అభ్యుదయ రైతులను జిల్లా అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్ మాధవ రావు మాట్లాడుతూ, గత రెండు సీజన్లలో రాజమహేంద్రవరం రూరల్ మండలం, సీతానగరం మండలానికి చెందిన అభ్యుదయ రైతులు నానో ఎరువుల వినియోగం ద్వారా మంచి ఫలితాలు సాధించారని, …

Read More »

“స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కలెక్టరేట్ లో ప్రచార గోడ ప్రతుల ఆవిష్కరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” కార్యక్రమం ప్రచార గోడ ప్రతులను జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి టి. సీతారామ మూర్తి మాట్లాడుతూ, తూర్పు గోదావరి జిల్లాలో సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు నిర్వహించబడే “స్వస్థ నారీ – సశక్త్ పరివార్ అభియాన్” శిబిరాల ద్వారా వైద్య సేవలు అందించ నున్నట్లు తెలిపారు. మహిళలకు …

Read More »

2025 జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ లో మూడో స్థానం

-రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం కాంస్య పతకం -ఎస్ రాహుల్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులోని అప్పాలో ఇటీవల నిర్వహించిన 7వ ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్–2025లో జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ హైజీన్ పోటీలో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి కాంస్య పతకం సాధించిందనీ కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని కేంద్ర కారాగార పర్యవేక్షణాధికారి ఎస్. రాహుల్ స్వీకరించామన్నారు. జైళ్లలో పరిశుభ్రత, ఆరోగ్యకర …

Read More »

తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా కొత్త కలెక్టర్‌గా ఐఏఎస్ అధికారి కీర్తి చేకూరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ ట్రాన్స్కోలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కీర్తి చేకూరి నీ రాష్ట్ర ప్రభుత్వం గురువారం తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ గా బదిలీ చేయడం జరిగింది. విశాఖపట్నం స్వస్థలమైన కీర్తి చేకూరి ఐ ఐ టి మద్రాస్‌లో ఉన్నత విద్య పూర్తి చేశారు. ఆమె మూడు సార్లు యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి, మొదటి సారి 440 ర్యాంక్ , …

Read More »

విదేశీ పక్షుల సంరక్షణకు, వీటిని చూడ్డానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి…

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త : రాజానగరం నియోజకవర్గం, రాజా నగరం మండలం పుణ్యక్షేత్రం గ్రామంలో సందడి చేసే విదేశీ పక్షులను సంరక్షణకు, వీటిని చూడ్డానికి వచ్చే సందర్శకులకు సదుపాయాలతో పర్యాటక ఆకర్షణ కేంద్రంగా అభివృద్ధి చేస్తామని రాజానగరం శాసనసభ్యుడు బత్తుల బలరామకృష్ణ తెలిపారు. శుక్రవారం పుణ్యక్షేత్రం గ్రామంలో అటవీశాఖ అధికారులు, ఇతర శాఖల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో పక్షుల సంరక్షణ కేంద్రం ఏర్పాట్లపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, నాలుగు కోట్ల రూపాయలతో పుణ్యక్షేత్రం పక్షుల సంరక్షణ …

Read More »

ఎస్‌కెవీటీ కళాశాల అభివృద్ధికి కృషి

– ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ – రూ. 65 లక్షలతో అభివృద్ధి పనులకు శ్రీకారం రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగం పంతులు వారి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. స్థానిక ఎస్‌కెవీటీ డిగ్రీ కళాశాల ఆవరణలోని మేజర్‌ డ్రైనేజీపై ఐరన్‌ షట్టర్లు ఏర్పాటు చేసే నిమిత్తం రూ. 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్‌కెవీటీ కళాశాల ఆవరణలో నగర పాలక సంస్థ …

Read More »