రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరికం లేని సమాజం , విజన్ 2047 లక్ష్య సాధన కోసం తీసుకున్న చర్యలపై ఫలితాలు సాధించడం దిశలో తూర్పు గోదావరి జిల్లాలో తొలి అడుగు వేసిందనీ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ – పిజిఆర్ఎస్ లో పొసిబాబు కుమారుడు మోహన్ కలెక్టర్ ను కలిసి రవళి స్పిన్నింగ్ మిల్లులో కొత్తగా నియామకం పొందిన పోస్టు వివరాలు తెలియ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా …
Read More »Tag Archives: rajamandri
నేడే దిశా సమావేశం
-జూలై 8 న తూ.గో.జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం -జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి -రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు వెల్లడి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు గోదావరి జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ(దిశ) సమావేశం రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి దగ్గుబాటి పురంధేశ్వరి అధ్యక్షతన జూలై 8 మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సమావేశ మందిరం నందు జరగనున్నట్లు జిల్లా కలెక్టర్, కమిషనర్(FAC) పి.ప్రశాంతి సోమవారం ఓ …
Read More »అర్జీదారులతో గౌరవంగా మెలగాలి…
-సమస్య పరిష్కరిస్తున్న తీరును వారికి వివరించాలి. -పి జి ఆర్ ఎస్ అర్జీలపై అధిక దృష్టి పెట్టాలి. -పిజి ఆర్ఎస్ లో 216 అర్జీలు స్వీకరణ -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి జి ఆర్ ఎస్) లో వచ్చిన అర్జీల పరిష్కారం లో లోపాలకు తావు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. ఐ వి ఆర్ ఎస్ విధానం ద్వారా పి జి ఆర్ ఎస్ …
Read More »అమరావతిలో 500 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి, మెడికల్ కళాశాలకు ప్రతిపాదనలు
-రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సుభాష్ -విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే చర్యలు తప్పవు -రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా. రాజమండ్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రాజమండ్రిలోని ఈఎస్ఐ హాస్పిటల్ ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రికి వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగుల దగ్గరకి నేరుగా వెళ్లి అక్కడ అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వైద్యులు బాగా సేవలు అందిస్తున్నారా.. ఆసుపత్రిలో పారిశుధ్య నిర్వహణ బాగుందా..ఏమైనా సమస్య …
Read More »” ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీ కోసం” లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి.
-1100 కాల్ సెంటర్ నెంబర్ కు ఫిర్యాదులు అర్జీలు తెలపండి -ఆర్డీవో ఆర్ .కృష్ణ నాయక్ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజా సమస్యల పరిష్కార వేదిక లో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయిలో పరిష్కారం చెయ్యాలని ఆర్డీఓ ఆర్. కృష్ణ నాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు. సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన “పి జి ఆర్ ఎస్ – మీ కోసం” వేదిక లో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలసి స్వీకరించారు. …
Read More »తూర్పు లో ఎరువుల కొరత లేదు: వ్యవసాయ అధికారి: ఎస్. మాధవ రావు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా నందు ప్రస్తుతం ఎటువంటి ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు సోమవారం ఒక ప్రకటన లో తెలియ చేశారు. ఈ సందర్భంగా వివరాలు తెలియ చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో గత ఏప్రిల్ నెల నుండి ఇప్పటివరకు 35,869 టన్నుల వేర్వేరు రకాల ఎరువులను ప్రైవేటు డీలర్లు , మార్క్ ఫెడ్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. ఇందులో యూరియా 15,294 టన్నులు, డి.ఎ.పి. 2,615 టన్నులు, పొటాష్ …
Read More »రాజీ మార్గం రాజ మార్గం.. లోక్ అదాలత్ ముఖ్య ఉద్దేశ్యం
-డి జె.. గంధం సునీత రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లకు సంబంధించి జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని శనివారం రాజమహేంద్రవరం జిల్లా కోర్టు ఆవరణలోని లోక్ అదాలత్ హాలు నందు శనివారం ఉదయం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్పర్సన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మాట్లాడుతూ గౌరవ సుప్రీంకోర్టు నల్సా వారి ఆదేశానుసారం దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ జాతీయ లోక్ …
Read More »పిల్లలకు ప్రత్యేక మెడికల్ క్యాంప్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి తూర్పుగోదావరి జిల్లా, రాజమహేంద్రవరం వారి ఆదేశాలు ప్రకారం, బాలసదనం లో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా జిల్లా సత్వర చికిత్స కేంద్రం డిఇఐసి (DEIC సెంటర్) సిబ్బంది, రాజమహేంద్రవరం వారు బాలసదనం లో ఉన్న పిల్లలకు ప్రత్యేక మెడికల్ క్యాంప్ నిర్వహించినట్లు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్ బి ఎస్ కే డాక్టర్ హరిచంద్ర తెలియ చేశారు. శనివారం బాలసదనంలో ఉన్న 19 మంది బాలబాలికలకు డిఇఐసి(DEIC సెంటర్) వారిచే స్క్రీనింగ్ …
Read More »ఇసుక అధికంగా లోడ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోండి: జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : పరిమితికి మించి ఇసుకను అధికంగా లోడ్ చేస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు చేపట్టాలని, వాహనాలను సీజ్ చేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఇసుక అంశం పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ… తాళ్లపూడి, ప్రక్కిలంక, వేగేశ్వరపురం పూడికతీత చేసే రీచ్ వద్ద వాహనాలలో ఇసుకను అధికంగా లోడ్ చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిఘా …
Read More »పదవ తేదీన జరిగే మెగా తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశానికి అన్ని ఏర్పాట్లు చేయాలి
-పి4 కార్యక్రమ అమలు కోసం గ్రామ స్థాయిలో కమిటీ -అన్నదాత సుఖీభవ పథకంలో లోపాలు లేకుండా చూడాలి -జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : జూలై 10వ బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల సమావేశానికి (పేరెంట్, టీచర్ మీటింగ్) జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్త మవ్వాలని , విజయవంతంగా నిర్వహించాలని కలెక్టర్ పి. ప్రశాంతి సూచించారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మెగా పేరెంట్, టీచర్ మీటింగ్; పి4 సర్వే; అన్నదాత …
Read More »
Prajavartha Online Telugu News