గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరాభివ్రుద్దికి సీనియర్ సిటిజన్స్ సూచనలు సలహాలు ఎంతో దోహదపడతాయని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐ.ఎ.యస్ అన్నారు. శుక్రవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సీనియర్ సిటిజన్స్ తో ప్రత్యేక సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ వివిధ రంగాలలో ఎంతో అనుభవం సాధించి ఉంటారని, అటువంటి వారి సూచనలు సలహాలు నగరాభివ్రుద్దికి ఎంతగానో అవసరమన్నారు. ప్రధానంగా పారిశుధ్యం, త్రాగు నీటి సరఫరా, రోడ్లు, డ్రైన్ల నిర్మాణం, పార్కులు, డివైడర్ల నిర్వహణ వంటి అంశాల పై నిర్మాణాత్మకమైన సూచనలు అందించాలని కోరారు. సీనియర్ సిటిజన్స్ మరియు జియంసి అధికారులతో ప్రత్యేకంగా వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేస్తామని, గ్రూప్ లో తమ అభిప్రాయాల్ని పోస్ట్ చేయవచ్చునని తెలిపారు. కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న తగ ఐదు నెలల కాలంలో పారిశుధ్యం, రోడ్ల ఆక్రమణ, డ్రైన్లలో పూడికతీత, త్రాగు నీటి సరఫరా పై ప్రనాలికాబద్దమైన కృషి చేశామన్నారు. రాబోవు కాలంలో సీనియర్ సిటిజన్స్ సూచనల ద్వారా నగరాభివ్రుద్దికి, నగర్ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలూ కల్పించుటకు కృషి చేస్తామన్నారు.
అనంతరం పలువురు సీనియర్ సిటిజన్స్ మాట్లాడుతూ, తొలిసారిగా నగరాభివృద్ది, నగరంలో చేపట్టాల్సిన అంశాల పై తమ అభిప్రాయాలు, సూచనలు తెలిపేందుకు సమావేశం ద్వారా వేదిక కల్పించినందుకు నగర కమీషనర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. నగరంలో ప్రధానంగా వార్డు అభివృద్ధి కంమిటీలను ఏర్పాటు చేయాలని, సుదీర్గ కాలంనుండి అసంపూర్తిగా ఉన్న నార్ల ఆడిటోరియం పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని, గోరంట్ల కొండ పై రిజర్వాయర్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని, త్రాగు నీటి రిజర్వాయర్ల వద్ద వివరాలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలని, శంకర విలాస్ ఆర్ ఓ బి నిర్మాణ పనులు ప్రారంభానికి ముందే రాకపోకలకు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్దం చేయాలని సూచించారు. అలాగే రోడ్లపై ర్యాంపులు ఆక్రమణలను లేకుండా చూడాలని, అనధికారిక ఫుడ్ స్టాల్స్ తొలగించి నగరంలో ప్రాంతాల వారీగా ఫుడ్ కోర్ట్ లు పెట్టాలని, ప్రతి వార్డులో సీనియర్ సిటిజన్స్ కు కమ్యూనిటీ హాళ్ళు నిర్మాణం, ఉచిత మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరారు.
సమావేశంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, డిప్యూటి కమిషనర్ సి.హెచ్ శ్రీనివాసరావు, యస్.ఈ నాగమల్లెశ్వర రావు, సి.పి రాంబాబు, సి.యం.ఓ.హెచ్ డాక్టర్ అమృతం, పి.ఓ రామారావు, ఎ.డి.హెచ్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
రోడ్డు భద్రత పై అవగాహన…
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అబ్జర్వెన్స్ ఆఫ్ నేషనల్ రోడ్డు సేఫ్టీ లో భాగంగా పడవల రేవు సెంటర్లో …