Breaking News

స్వ‌చ్ఛ‌త‌లో చిత్త‌శుద్ధికి క‌లెక్ట‌ర్ స‌త్కారం

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
“స్వచ్ఛ మచిలీపట్నం ఛాంపియన్స్” గా ఎంపికైన గొడుగు పేటకు చెందిన సౌభాగ్యవతి, మల్కాపట్నంకు చెందిన నందిని, గొడుగు పేటకు చెందిన సౌభాగ్యవతి లను అభినందించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ. స్వ‌చ్ఛాంధ్ర‌, హ‌రితాంధ్ర‌, ఆరోగ్య ఆంధ్ర ల‌క్ష్యంగా స్వచ్ఛతలో చిత్తశుద్ధికి నిర్వహిస్తున్న ఛాంపియన్లను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

ప్రతినెల మూడవ శనివారం నిర్వహించే స్వ‌చ్ఛాంధ్ర – స్వ‌చ్ఛ దివ‌స్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం
ఈ వారం ఇతివృత్తమైన సోర్స్ – రిసోర్స్ లో వినూత్న కార్యక్రమాలను నిర్వహించారు. మచిలీపట్నం గొడుగుపేట కు చెందిన సౌభాగ్యవతి, రైల్వే స్టేషన్ సమీపంలోని మల్కాపట్నం కు చెందిన నందిని లను “స్వచ్ఛ మచిలీపట్నం ఛాంపియన్స్” అవార్డుతో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చెత్త నుండి సంపద తయారీ ఇతివృత్తంగా గత 20 సంవత్సరాలుగా ఇంటిలోని చెత్తను కంపోస్ట్ ఎరువుగా మార్చి పండ్ల, కూరగాయ, పూల మొక్కలను పెంచుతూ పర్యావరణ పరిరక్షణకు సహకారం అందిస్తున్నారన్నారు. మన చెత్త- మన ఎరువు- మన మొక్క- మన బాధ్యత నినాదంతో ఇంటిలోని తడి చెత్తను మట్టితో కప్పి రెండు నుండి మూడు నెలలు అనంతరం కంపోస్ట్ ఎరువుగా మారిన ఆ మట్టిని మొక్కల పెంపకానికి వినియోగించడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. నగరపాలక సంస్థకు యెటువంటి చెత్తను ఇవ్వకుండా ఇంటిలో వాడిన చెత్తతో సంపద తయారీ కేంద్రంగా తమ ఇంటినే మరల్చుకొని ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకొని స్వ‌చ్ఛాంధ్ర‌, హ‌రితాంధ్ర‌, ఆరోగ్య ఆంధ్ర లక్ష్యంగా పాటు పడాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

కార్యక్రమంలో బందరు ఆర్డిఓ కే స్వాతి , మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వివిఎస్ బాపిరాజు, శానిటేషన్ అధికారులు, సిబ్బంది ఉన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

 తేదిన గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ మరియు జిల్లా స్థాయి ఇసుక టాస్క్ ఫోర్స్ అధికారులు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : గనులు భూగర్భశాఖ రాజమహేంద్రవరం, జల వనరుల శాఖ, ఏజీఎల్బి సెక్షన్, స్థానిక రెవెన్యూ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *