Breaking News

సంచలనం సృష్టించిన విజయ్

తమిళనాడు, నేటి పత్రిక ప్రజావార్త :
నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) చీఫ్ విజయ్ సంచలనం సృష్టించారు. తమిళ రాజకీయాల్లో అసాధ్యమనుకున్నది సుసాధ్యం చేసి చూపించారు. పార్టీని స్థాపించిన కేవలం రెండేళ్లకే చరిత్ర లిఖించారు. టీవీకే ఏర్పాటు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలతో ‘విజిల్’ వేయించి మెజార్టీ స్థానాలు గెలవడం ద్వారా అటు సినిమాల్లోనే కాదు.. ఇటు పాలిటిక్స్లోనూ ‘సూపర్ ‘సూ హిట్’ కొట్టారు. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గాల నుంచి బరిలోకి దిగిన విజయ్.. రెండు చోట్లా తన సమీప ప్రత్యర్థులను ఓడించి సత్తా చాటారు. ఈ అపూర్వ విజయంతో మంచి జోష్లో ఉన్న టీవీకే శ్రేణులు, నేతలు ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముమ్మర కసరత్తు చేస్తున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే విజయ్ మే 7న సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లు అనుకుంటున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *