Breaking News

అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF) రాబట్టుటకు కన్సల్టెన్సు తో సమావేశం

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ రాబట్టుటకు కన్సల్టెంట్స్ తో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సమావేశం నిర్వహించారు. మంగళవారం సాయంత్రం ప్రధాన కార్యాలయంలోని తమ చాంబర్లో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమావేశంలో అర్బన్ ఛాలెంజ్ ఫండ్స్ లో భాగంగా నగరాభివృద్ధికి వచ్చే 15 సంవత్సరాలకు సరిపడా నీటి సరఫరా, భూగర్భ డ్రైనేజ్ ప్రాజెక్ట్ ప్రణాళికలను ఇంజనీరింగ్ సిబ్బంది డి పి ఆర్ లు సిద్ధం చేయగా, దానికి ఖర్చయ్యే వ్యయం దాదాపు నీటి సరఫరాకు 319 కోట్లు మరియు భూగర్భ డ్రైనేజ్ కి 733 కోట్లు కాగా, అందులో 25% కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని, మిగతా 25 % రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది కాబట్టి మున్సిపల్ బాండ్స్, బ్యాంకర్లు కలిపి 50% ఉండాలి కావున, వివిధ ప్రాజెక్ట్ల నిమిత్తం అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ను రాబట్టు టకు గాను కన్సల్టెంట్స్ తో సమావేశం నిర్వహించారు .

ఈ సమావేశంలో కన్సల్టెంట్లు అనురాగ్ అరుణ్, ఏ కే ఎస్ కన్సల్టెన్సీ న్యూఢిల్లీ మరియు ఐ రమణమూర్తి, రామన్న అసోసియేట్స్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *