Breaking News

చాత్తాద శ్రీ వైష్ణవులకు కార్పోరేషన్ మంజూరు చేయాలి…

– సంఘ అధ్యక్షులు జె.సత్యనారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చాత్తాద శ్రీ వైష్ణవులకు కూడా కార్పోరేషన్ మంజూరు చేయలని సంఘం అధ్యక్షులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఆదివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై నిరంతరము అనేక విధముల సహాయం చేయుచున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మా సంఘాన్ని కూడా గుర్తించి ప్రోత్సాహం అందించాలని ఏ విధమైన ప్రగతిలేని చాత్తాద శ్రీ వైష్ణవులను బి.సి. సబ్ ప్లాను ద్వారా ఆర్థిక సహాయం కొరకు కార్పొరేషను కు రెండు సంవత్సరములుగా విజ్ఞప్తి చేయుచున్నాము. గతంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖామాత్యులు కింజారపు అచ్చెన్నాయుడు స్పందించి మా కులాన్ని బాగా వెనుకబడిన తరగతుల ఫెడరేషనులో చేర్చమని 19-04-2018 తేదీన వెనుక బడిన తరగతుల శాఖను ఆదేశించారు. కాని ఆదేశాలు ఈ రోజు వరకు అమలు రాలేదు. మేము రాష్ట్రంలో 4,20,000 జనాభాకల్గి ప్రభుత్వాన్ని నమ్ముకొనియున్నాము. మాకు కులవృత్తులు, కనుమరుగవడం, ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు లేక కష్టాలపాలై చిన్న, చిన్న వ్యాపారాలు, ఉపాధ్యాయులు, ఆయుర్వేద వైద్యులుగా, పూజారులుగా దయనీయ స్థితిలో మనుగడ సాగిస్తున్నారు. సామాజికంగా, ఆర్థికంగా బలహీనులమనీ మాకు ఎవరికి కూడా భూ వసతిలేదు. విద్యా పరంగా మా బిడ్డలను పై చదువులు చదివించలేక పోవుచున్నాము.బి.సి. రిజర్వేషనులు , ఫెడరేషన్ లు పెద్ద కులాలవారు మాత్రమే అందిపుచ్చుకుంటున్నారు. ఏ విధమైన సహాయం లేక ప్రభుత్వం మమ్మల్ని విస్మరించిందనే భావం కలుగుచున్నది. ఆర్థికంగా, సామాజికంగా మా పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతుంది. మాకు రాజకీయంగా ప్రాతినిధ్యం లేదు. తెలుగుదేశం ప్రారంభించిన దశ నుండి ఈ రోజువరకు మా వర్గీయులు ప్రభుత్వానికి విశ్వాస పాత్రులు ఉన్నారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బి.సి.ల అభ్యున్నతికై సబ్ ప్లాను ద్వారా సహాయం చేయుచున్న నేటికి ప్రభుత్వ ఫలాలు అందక చీకటిలో మగ్గుతున్నం. మాకు కూడా ఒక కార్పొరేషన్ ఏర్పరచి ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేశారు.
బీదవారమైన మా సమాజాభివృద్ధికి విజయవాడ పరిసరాల్లో 300 చ.గ.లలో ఒక కమ్యూనిటీ హాలు కూడా మంజూరు చేయలని చాత్తాద శ్రీ వైష్ణవులకు రాష్ట్రంలోని దేవాలయ కార్యవర్గంలో ప్రాధాన్యతనిచ్చి నామినేటెడ్ పోస్టులలో నియమించమని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ సమావేశంలో శ్రీ రంగనాయక వేద విద్యాపీఠం గురువర్యులు శ్రీమాన్ టి.యమ్.సూరి, వైస్ ప్రెసిడెంట్ టి.వి. రమణ, జనరల్ సెక్రటరీ ఎమ్. రాంబాబు, వైస్ ప్రెసిడెంట్ ఎస్. నమ్మయ్య, టి. నారాయణ మూర్తి , కృష్ణాజిల్లా ప్రెసిడెంట్ టి. శ్రీకాంత్, కృష్ణాజిల్లా జనరల్ సెక్రటరీ ఎమ్. లక్ష్మణరావు, టి కాంతయ్య, కేశవాచార్యులు, టి. పూర్ణయ్య, నీలాచలం వెంకటరమణ అనకాపల్లి జిల్లా, రాయల సీమ సంఘం కార్యదర్శి టి.నాగేంద్ర, అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి గౌరీ సోమశేఖర్, వివాహ పరిచయ వేదిక కార్యదర్శి తిరునగరి తిరునగరి కేశవదాసు , టి. చక్రపాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

16 నెలలు… 16కు పైగా విజయాలు…

-స్పష్టమైన మార్పు చూపించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమం -ఇదే స్ఫూర్తితో పనిచేయాలని ప్రభుత్వ యంత్రాంగానికి సీఎం చంద్రబాబు పిలుపు -ప్రజల సహకారంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *