Breaking News

నా సంకల్పం… నా దేశం కోసం!

– ఆగస్టు 10 నుంచి 15 వరకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమం
– స‌మాజంలోని ప్ర‌తిఒక్క‌రూ కార్య‌క్ర‌మంలో పెద్దఎత్తున భాగ‌స్వాములు కావాలి
– ఇంటింటా జాతీయ జెండా… ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తి
– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడినీ భాగస్వామిగా చేస్తూ, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలనే స్ఫూర్తిని ప్రజల్లో పెంపొందించేందుకు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సూచించారు.
స్వాతంత్ర్యం సిద్ధించి 79 సంవత్సరాలు పూర్తిచేసుకుని 80వ స్వాతంత్ర్య సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహిస్తున్న “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమంలో జిల్లా ప్రజలు పెద్దఎత్తున భాగస్వాములు కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. దేశ నిర్మాణం అనేది కేవ‌లం ప్రభుత్వం బాధ్యత మాత్ర‌మే కాదని, ప్రతి పౌరుడి భాగస్వామ్యం, బాధ్యత, కృషితోనే దేశం మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశం (వికసిత్ భారత్) లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి పౌరుడూ తన వంతు పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని తెలిపారు. “అనే నేను” కార్యక్రమం ద్వారా ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో తాను చేయగలిగే ఒక మంచి పనిని లేదా కృషిని సంకల్పంగా స్వీకరించాలని కలెక్టర్ సూచించారు. “దేశం కోసం నేను… నా వంతు కృషి చేస్తాను” అనే స్ఫూర్తితో ప్రజలు తమ బాధ్యతను చాటేలా కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, ప్రముఖులు తదితరులు తమ దేశభక్తి, దేశ నిర్మాణంపై తమ ఆలోచనలు, భవిష్యత్ లక్ష్యాలను ప్రతిబింబించేలా 30 సెకన్ల “అనే నేను” వీడియోలను రూపొందించి సోషల్ మీడియాలో పోస్టు చేయాలని తెలిపారు. “అనే నేను” వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసే సమయంలో
#PartnersInNationaBuilding
#MyIndiaMyVision
#IndependenceDay2026
#SwarnaNTR2047
#WeAreForViksitNTR
#TeamNTR_District

అనే హ్యాష్‌ట్యాగ్‌లను తప్పనిసరిగా ఉపయోగించాలని, అలాగే @APOfficialNewsను ట్యాగ్ చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరి బాధ్యత, ఆశయం, దృక్పథం ప్రజలకు తెలియజేయడంతో పాటు యువతలో దేశభక్తి, సామాజిక బాధ్యత, ప్రజా భాగస్వామ్య స్ఫూర్తిని మరింత పెంపొందించాలని తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు “హర్ ఘర్ తిరంగా” కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని ప్రతి ఇంటిపైనా జాతీయ పతాకాన్ని ఎగురవేసేలా ప్రజలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. జాతీయ జెండా ప్రతి ఇంటిపై రెపరెపలాడేలా చేసి, ప్రతి ఇంటినీ జాతీయ స్ఫూర్తికి ప్రతీకగా నిలపాలని కోరారు. పంద్రాగస్టు వేడుకలను కేవలం ఉత్సవంగా కాకుండా దేశభక్తి, జాతీయ ఐక్యత, బాధ్యత, దేశ నిర్మాణంపై ప్రజల్లో అవగాహన పెంపొందించే సందర్భంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో “అనే నేను” కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులను చురుకుగా భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్ లక్ష్యాలు, దేశం పట్ల తమ ఆకాంక్షలు, దేశ నిర్మాణంలో తాము చేయాలనుకుంటున్న కృషి గురించి తెలియజేసేలా ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి పౌరుడి భాగస్వామ్యంతోనే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ అన్నారు. ప్రజలు, అధికారులు, యువత, విద్యార్థులు, క్రీడాకారులు, కళాకారులు, వివిధ రంగాల ప్రముఖులు, స్వచ్ఛంద సంస్థలు తదితరులు “Partners in Nation Building – #AneNenu” కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ప్రజా భాగస్వామ్య స్ఫూర్తితో విజయవంతం చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. “దేశం కోసం నేను… నా వంతు కృషి చేస్తాను” అనే సంకల్పంతో ప్రతి పౌరుడు ముందుకు రావాలని, ఇంటింటా జాతీయ జెండా ఎగురవేస్తూ ప్రతి ఇంటా జాతీయ స్ఫూర్తిని నింపాలని జిల్లా కలెక్టర్ డా. జి.ల‌క్ష్మీశ కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *