Breaking News

బీజేపీది రెండు నాల్కల ధోరణిలా ఉంది… : కె నారాయణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిజెపి భాగస్వామిగా ఉన్న సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు జార్ఖండ్లో విద్యార్థుల పైన దాడికి సంబంధించి చాలా జోరుగా మాట్లాడుతున్నారు. జార్ఖండ్లో పేపర్ లీకేజీ అయిన మాట వాస్తవం. విద్యార్థుల ఉద్యమం జరుగుతున్న మాట వాస్తవం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి తగిన విచారణ జరిపిస్తానని ముందుకు వచ్చి, విద్యార్థులతో మాట్లాడేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఆ తరుణంలో జార్ఖండ్ లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, జార్ఖండ్ మొత్తం అల్లకల్లోలం అయిందని బిజెపి చెబుతోంది. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న కంగనా రనౌత్ నిజం మాట్లాడటం తెలియదు. ఢిల్లీలో జంతర్ మంతలో ఉద్యమకారులపైన, విద్యార్థిని విద్యార్థులపైన, యువతీ యువకులపైన అన్యాయమైన దాడి చేస్తూ, వాళ్ళని వేధింపులకు గురిచేస్తూ, మానభంగాలు చేసే స్థాయికి వెళ్లిపోయి గందరగోళం చేస్తుంటే, వాళ్ల ఇళ్లకు వెళ్లి లాఠీఛార్జ్ చేస్తుంటే, ఒక అమ్మాయి తీవ్రంగా గాయపడి చివరికి చనిపోతే అప్పుడు వీళ్లంతా ఏమైపోయారు? ఆనాడు మాట్లాడేందుకు నోరు పెగల్లేదా? ప్రధాని మోడీ ఎందుకు మాట్లాడలేకపోయారు? మోడీ ఇప్పుడేదో మాట్లాడుతూ విద్యార్థులను క్షమించానని చెబుతున్నారు. కానీ విద్యార్థులే కేంద్ర పాలకులను క్షమించాలి. పార్లమెంటుకు రాకుండా అమిత్ షా మొహం చాటేసి, ఎగ్గొడుతున్నారెందుకు? అమిత్ షా ఎందుకు భయపడుతున్నారు? తాను తప్పు చేశానని ఫీలవుతున్నారు కాబట్టి అమిత్ షా పార్లమెంటుకు వెళ్లలేకపోతున్నారు. ఢిల్లీలో జరిగిన విద్యార్థి ఉద్యమంపై మాట్లాడేందుకు మొహం చాటేసిన బిజెపి నేతలు, జార్ఖండ్ విషయంలో మాట్లాడటానికి అది నాలిక తాటి మట్టా అని ప్రశ్నిస్తున్నాం. విద్య వ్యవస్థ మొత్తం ప్రైవేటీకరణ అయిన తర్వాత వ్యాపార రంగంగా మారిపోయింది. వాస్తవ పరిస్థితులను గమనించి, ముందు దానిని మార్చండి. విద్య, వైద్యం ప్రభుత్వపరం చేస్తే ఇటువంటి ఘటనలు జరగవు. జార్ఖండ్లో ఒక నాలిక, ఢిల్లీలో మరొక నాలికతో బిజెపి నేతలు మాట్లాడటం దుర్మార్గం. బీజేపీది రెండు నాల్కల ధోరణిలా ఉంది. బిజెపి ద్వంద ప్రమాణాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటనలో సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె నారాయణ అన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *