విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.14.08.2026 శుక్రవారం ఉదయం 09:00 గంటలకు మన విజయవాడ లోని ఆధ్యా స్టోర్ (The Unit of Rama), పాత SBI బ్రాంచ్, ఆపోజిట్: జూడియో స్టోర్స్, D.No: 59-13-4, ఘంటసాల వారి స్ట్రీట్, గాయత్రీ నగర్, విజయవాడ నందు “కంపెనీ Specific డ్రైవ్” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి మరియు నైపుణ్య అధికారి సి. మధుభూషణ్ రావు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు తెలియజేసారు.
ఈ కంపెనీలో గల ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తిచేసిన 18 నుండి Below 29 సంవత్సరాల లోపు యువతి మరియు యువకులు అర్హులని, ఎంపిక అయిన వారికి నెలకి Rs. 15,000/- నుంచి Rs. 25,000/- వరకు వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, ఆగష్టు 14 న నిర్వహించబోయే ఈ కంపెనీ Specific డ్రైవ్ కు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.
ఆసక్తి మరియు తగిన అర్హతలు గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు తప్పనిసరిగా తమ పూర్తి వివరాలతో రిజిస్టర్ కావడంతోపాటు, సదరు కంపెనీ Specific డ్రైవ్ కు Resume తో లేదా Bio Data Form తో పాటు ఆధార్, ఆధార్ కు లింక్ అయిన ఫోన్ నెంబర్, PAN కార్డ్ కాపీ మరియు సర్టిఫికెట్ల Xerox కాపీలతో రావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 81259 73743, 99857 59304 మరియు 93477 79032 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు.
Prajavartha Online Telugu News