Breaking News

పేదవాడిని మరింత పేదవాడుగా…పెద్దవారిని మరింత పెద్దవారిగా మారుస్తున్న మోడీ పాలన

-రాష్ట్ర సంపాదనను అంగడిలో పెట్టి అమ్ముతున్న నోరుమెదపని రాష్ట్ర పాలకులు
-పాదయాత్రలో జి.కోటేశ్వరరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, తిరోగమన విధానాలతో పేదవాడు మరింత పేదవానిగా , పెద్ద వాడు మరింత పెద్దవానిగా మారుస్తున్న పాలకుల అనాలోచిత విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు అధోగతి పాలవుతున్నారని సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు అన్నారు. పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఐ జాతీయ సమితి పిలుపులో భాగంగా సిపిఐ నగర సమితి ఆధ్వర్యంలో నగర వ్యాప్తముగా జరుగుతున్న ప్రచార పాదయాత్ర 7వ రోజైన బుధవారం నగర కార్యవర్గ సభ్యులు కొడాలి ఆనందరావు అధ్యక్షతన క్రీస్తురాజపురం, చండ్రరాజేశ్వరావు గ్రంధాలయం నుండి ప్రారంభమై మొగల్రాజపురం సిద్దార్ధ కాలేజీ వరకు సాగింది. ఈ కార్యక్రమానికి పార్టీ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ దేశంలో ఒకవైపు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని కార్మిక హక్కుల చట్టాలను హరిస్తూ గత సంవత్సర కాలంలో రైతాంగం స్వతంత్ర సమర సమయంలో పోరాటాలు చేసిన మాదిరిగా రైతాంగాలు పోరాటాలు చేయడం మనం చూసామని, నరేంద్ర మోడీ తీసుకువచ్చిన నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ పోరాటాలు కొనసాగుతాయని, నీట్ పేపర్ లీకేజీ వలన 22 మంది విద్యార్థులతో ప్రాణాలను త్యాగం చేస్తే వారి కుటుంబాలు ఎంత రోదిస్తున్నాయి అనేది ప్రభుత్వానికి కనిపించడం లేదా మోదీ ని నిలదీశారు. సంవత్సరానికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పిన కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాలలో ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఎక్కువగా ప్రైవేట్ విద్యా సంస్థలే రాష్ట్రంలో రాజ్యమేలుకున్నాయని పేర్కొన్నారు . శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలే శాసిస్తున్నాయని. ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని అందించడంలో కూడా విఫలమైందన్నారు..పేదలకు వైద్యం అందని ద్రాక్ష లాగా ఉందని పేదవాడి ఆరోగ్యాన్ని బ్రతికించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలిపారు. నగర సమగ్రాభివృధికి ప్రభుత్వం 50 వేల కోట్ల నిధులను కేటాయించి నగరంలో మౌలిక వసతుల కల్పనా, ఇళ్ళు లేని ప్రజలకు 2 సెంట్ల నివాస స్థలం ఇంటి నిర్మణానికి 5 లక్షల ఆర్థిక సహాయ, అలాగే కొండప్రతాలలో నివాసితున్న వారి ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ చేసి వారి నివాసానికి భద్రతా, వారి అవసర సమయంలో ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేసారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మరిన్ని సౌకర్యలను కల్పించి పేద ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఉదృతస్థాయిలో ఉద్యమాలను చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నగర సహాయ కార్యదర్శి నక్క వీరభద్రరావు, నగర కార్యదర్శివర్గ సభ్యులు మూలి సాంబశివరావు, అప్పూరుబోతు రాము, పంచదార్ల దుర్గంభా, తాడి పైడయ్య, నగర కార్యవర్గ సభ్యులు తూనం వీరయ్య, లంకా గోవిందరాజులు, దోనేపూడి సూరిబాబు, నగర నాయకులు కొండపల్లి క్రిష్ణ , పగిడికత్తుల రాము, పత్తిపాటి రాజు, పడాల కనకారావు, కొండేటి శ్రీనివాస్, జి.వెంకటరావు, రాచకుల శ్రీనివాస్, జోసెఫ్,ఏఐటీయూసీ నాయకులు కె.ఆర్.ఆంజనేయులు, బెవర శ్రీను,కె.విజయ్, ప్రజానాట్యమండలి ఆర్.పిచ్చయ్య, మహిళా సమాఖ్య నాయకురాళ్లు, బంక ఝాన్సీ, దుగ్గిరాల సీతారావమ్మ, డి.రమణమ్మ, దర్శనం పుష్ప, నీలపు భాగ్యలక్ష్మి, అనిత, షైనీ ఎఐవైఎఫ్ నాయకులు వెంకీ,మోహన్, రవి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *