విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
18న జరుగు జన్ జీ రైజింగ్ సభ జయప్రదం చేయండి అని రాష్ట్ర కన్వీనర్ ఉన్నం అనిల్ కుమార్ కోరారు. గురువారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమ పోరాట స్ఫూర్తితో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై విద్యార్థుల హక్కుల కోసం నిరుద్యోగ యువత కోసం చైతన్యం చేయడానికి వారి హక్కుల కోసం పోరాడటానికి జన్ జీ పోరాటంలో 23 రోజులు ఆమరణ నిరాహార దీక్ష నిర్వహించిన ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ – ఏఐఎస్ఎ జాతీయ అధ్యక్షురాలు కామ్రేడ్ నేహా దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఆగస్టు 18 గంటలకు విజయవాడ హనుమంతు రాయ గ్రంధాలయంలో జరుగుతుంది. దేశవ్యాప్తంగా విద్యార్థులకు సమస్యలపై ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థి సంఘాలను మీడియా మిత్రులను స్కూలు కాలేజీలు సాంఘిక సంక్షేమ హాస్టల్ లోకి అనుమతి నిరాకరించడానికి ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జరుగుతున్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువత పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి హరినాథ్, రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, ఏలూరు జిల్లా ఇన్చార్జ్ అఖిల్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు మహేష్, కృష్ణా జిల్లా కార్యదర్శి శివ నాయక్, కడప జిల్లా కన్వీనర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News