Breaking News

గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సాధించిన మహిళ మనోవికాస సంస్థ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో శుక్ర‌వారం 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మన ప్రధాని నరేంద్ర మోడీ హర్ ఘర్ తిరంగా సందేశ స్ఫూర్తితో 330 మంది కలసి తయారుచేసిన ఊలు జాతీయ జెండాలను మహిళా మనోవికాస సంస్థ సభ్యులు కే కుసుమ, యెన్ స్వర్ణ, పిఎల్ అన్నపూర్ణ ఠాగూర్ గ్రంథాలయమునకు విచ్చేసి కే రమాదేవి గ్రంథాలయాధికారికి మరియు 50 మంది విద్యార్థులు జాతీయ జెండాలు అందజేశారు
స్వర్ణ మాట్లాడుతూ ఈ జాతీయ జెండాను 7 సంవత్సరాల పిల్లలనుంచి 80 సంవత్సరాల వృద్ధుల వరకు తయారు చేశారు ఇందులో వికలాంగులు, క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారు. ఈ జాతీయ జెండా మొత్తం పొడవు 12.18 కిలోమీటర్ల 45 వేల జెండాలను తయారు చేశామన్నారు.
ఇంకొక సభ్యురాలు కుసుమ మాట్లాడుతూ ఈ జెండాలో పర్యావరణానికి హాని కలుగకుండా ఊలు తో తయారుచేశామన్నారు. ఇంకొక సభ్యురాలు అన్నపూర్ణ మాట్లాడుతూ ఈ జెండాలు తయారు చేయటం వలన ఒత్తిడి తగ్గి చరవాణి వాడకం తగ్గించడానికి చాలా ఉపయోగపడింది అని తెలియజేశారు.
అనంతరం గ్రంథాలయాధికారి కే. రమాదేవి గిన్నిస్ రికార్డు సాధించిన మహిళా మనోవికాస సంస్థను అభినంది చుతూ ఈ ముగ్గురు సభ్యులను దుస్సలు వాతో సత్కరించారు. విద్యార్థులు అందరూ వాళ్ళకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *