Breaking News

జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎం. శివ ప్రసాద్, ఐ.ఎఫ్. ఎస్.

-ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణీకుల భద్రత, మెరుగైన సేవలే లక్ష్యమని వెల్లడి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సంస్థ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎం. శివ ప్రసాద్, ఐ.ఎఫ్. ఎస్. ఈరోజు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం, ఆర్టీసీ హౌస్ లోని తన ఛాంబర్ లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.బాధ్యతలు స్వీకరించిన అనంతరం సంస్థ వి సి.& ఎం.డి. బాల సుబ్రమణ్యం, ఐ.పి.ఎస్.ని ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు.
సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్)  రాఘవ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంజినీరింగ్) జి.వి.రవి వర్మ, ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ. సుధాకర్,చీఫ్ పర్సనల్ మేనేజర్ వి.శ్రీధర్ఆయనకు పుష్పగుచ్చం అందజేసి సాదర ఆహ్వానం పలికారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల భద్రత, సమయపాలన, తదితర అంశాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా పని చేస్తామని పేర్కొన్నారు. సంస్థ అభివృద్ధికి అధికారులు, ఉద్యోగులు అందరూ క్రమశిక్షణతో, అంకితభావంతో కలిసి పనిచేయాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(అడ్మిన్) కె.ఎస్. బ్రహ్మానంద రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఆపరేషన్స్) రాఘవ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఇంజినీరింగ్) జి.వి.రవి వర్మ, ఎఫ్.ఏ.& సి.ఏ.ఓ. సుధాకర్,చీఫ్ పర్సనల్ మేనేజర్ వి.శ్రీధర్, ఉన్నతాధికారులు, అధికారులు, సూపర్వైజర్లు, వివిధ అసోసియేషన్ల ప్రతినిధులు, ఉద్యోగులు పలువురుపాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *