Breaking News

ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో APSRTC–JAC కీలక ముందడుగు

-40 అంశాలపై సామరస్యపూర్వక చర్చలు – 35 అంశాలకు పరిష్కారం
-5 అంశాలు ప్రభుత్వ పరిశీలనకు..76 కుటుంబాలకు Compassionate Appointments
-6–7 నెలల్లో సుమారు 1,550 కొత్త బస్సులు – ప్రయాణికులు, ఉద్యోగులపై ఒత్తిడి తగ్గింపు
-EV బస్సులతో ఉద్యోగాలు పోవు – బస్సుల సంఖ్య పెరుగుతుంది: VC&MD శ్రీ ఎన్. బాలసుబ్రహ్మణ్యం, IPS

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ (APSRTC)లో ఉద్యోగుల సమస్యల పరిష్కారం, సంస్థ ప్రయోజనాల పరిరక్షణ, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పన లక్ష్యంగా యాజమాన్యం మరియు ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) మధ్య జరిగిన వరుస చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయనిPTD కమిషనర్&ఎక్స్-ఆఫీషియో VC&MD ఎన్. బాలసుబ్రహ్మణ్యం, IPSతెలిపారు.
ఈరోజు APSRTC ఉన్నతాధికారులు, Executive Directors మరియు JAC ప్రతినిధులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో VC&MD మాట్లాడుతూ, JAC ప్రతినిధులతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి వారు లేవనెత్తిన40 ప్రధాన అంశాలపై సమగ్రంగా చర్చించినట్లుతెలిపారు. సంస్థకు మంచి భవిష్యత్తు ఉండేలా, ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇరుపక్షాలు సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కారాలను సాధించాయని వెల్లడించారు.
40 అంశాల్లో 35 అంశాలకు పరిష్కారం
JAC సమర్పించిన మొత్తం40 అంశాల్లో 35 అంశాలను యాజమాన్యం–JAC పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకున్నామని, మిగిలిన5 అంశాలు ప్రభుత్వ పరిధిలో ఉన్నందున ప్రభుత్వ పరిశీలనకు పంపుతున్నామని VC&MD తెలిపారు.
ఉద్యోగ సంఘాలు, యాజమాన్యం ఒకే వేదికపై కూర్చొని సమస్యలను చర్చించి, సంస్థ ప్రయోజనాలు మరియు ఉద్యోగుల సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ పరిష్కార మార్గాలను కనుగొనడం ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన పేర్కొన్నారు.
76 కుటుంబాలకు Compassionate Appointments
ఉద్యోగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం, APSRTC యాజమాన్యం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని VC&MD తెలిపారు.
మెడికల్ అన్‌ఫిట్ అయిన43 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యులకు, అలాగే మెడికల్ అన్‌ఫిట్ అయి అనంతరం మరణించిన ఉద్యోగులకు సంబంధించిన33 మంది కుటుంబ సభ్యులకుకలిపి మొత్తం76 మందికి Compassionate Appointmentకల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
నిర్దిష్ట కాలపరిమితి ముగిసిన కొన్ని కేసులకు ప్రభుత్వం ఒకసారి ప్రత్యేక సడలింపు కల్పించి 76 కేసుల పరిష్కారానికి మార్గం సుగమం చేసిందని తెలిపారు. మిగిలిన అర్హత కలిగిన కేసులను కూడా నిబంధనల ప్రకారం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
కొత్త బస్సుల సమీకరణకు వేగవంతమైన చర్యలు
స్త్రీ శక్తి పథకం అమలుతో APSRTC బస్సుల్లో Occupancy Ratio గణనీయంగా పెరిగిందని VC&MD తెలిపారు. ప్రతి నెల సుమారు27 లక్షల మంది Beneficiariesఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారని చెప్పారు.
పెరిగిన ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కొత్త బస్సుల సమీకరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.
ప్రభుత్వం500 CNG బస్సులకుఆమోదం తెలిపిందని, ఇప్పటికే RFP జారీ చేసి Pre-Bid ప్రక్రియ పూర్తయిందని, మరో వారం నుంచి పది రోజుల్లో Tender Responses అందిన అనంతరం ప్రక్రియను పూర్తి చేసి 500 CNG బస్సులను సమకూర్చనున్నట్లు తెలిపారు.
అదేవిధంగాPM-eBusSewaకింద అందుబాటులోకి వచ్చే బస్సులను కూడా APSRTC వినియోగించుకోనుందని చెప్పారు.
ఈ చర్యల ద్వారా రాబోయే6–7 నెలల్లో సుమారు 1,550 కొత్త బస్సులు APSRTCలోకి వచ్చే అవకాశం ఉందని, దీంతో ప్రయాణికుల రద్దీతో పాటు ఉద్యోగులపై ఉన్న పని ఒత్తిడి కూడా గణనీయంగా తగ్గుతుందని VC&MD తెలిపారు.

ఎలక్ట్రిక్ బస్సులపై ఉద్యోగులకు పూర్తి భరోసా
ఎలక్ట్రిక్ బస్సుల ప్రవేశంపై ఉద్యోగుల్లో ఆందోళన అవసరం లేదని VC&MD స్పష్టం చేశారు.
ఎలక్ట్రిక్ బస్సులకు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకం కాదని, తమ డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది సేవలను ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణలో ఎలా వినియోగించుకోవాలన్నదే వారి ప్రధాన ఆందోళనఅని తెలిపారు.
PM-eBusSewaలో మొదటి దశలో750 బస్సులు, రెండో దశలో మరో300 బస్సులు, మొత్తం1,050 ఎలక్ట్రిక్ బస్సులుఅందుబాటులోకి రానున్నాయని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల seating capacity తక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన రవాణా సామర్థ్యాన్ని కొనసాగించేందుకు మరిన్ని బస్సులు అవసరమవుతాయని, అందువల్ల బస్సుల సంఖ్య తగ్గకుండా పెరిగే అవకాశం ఉందన్నారు.
“ఎలక్ట్రిక్ బస్సుల వల్ల డ్రైవర్లు, మెకానికల్ సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. బస్సుల సంఖ్య తగ్గదు.. పెరుగుతుంది”అని VC&MD భరోసా ఇచ్చారు.
నాలుగు మూసివేసిన డిపోలు పునఃప్రారంభం
ఇప్పటికే మూసివేసిననాలుగు డిపోలను తిరిగి ప్రారంభించేందుకునిర్ణయం తీసుకున్నామని VC&MD తెలిపారు.
ఆ డిపోలను సంబంధిత ప్రాంతాల్లోనే పునఃప్రారంభించి, అక్కడ అవసరమైన బస్సు సర్వీసులను కొనసాగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఉద్యోగ నియామకాలు దశలవారీగా కొనసాగుతాయి
APSRTCలో ఉద్యోగ నియామకాలు నిరంతర ప్రక్రియ అని VC&MD తెలిపారు.
ప్రస్తుతం ఉన్న అన్ని ఖాళీలను ఒకేసారి భర్తీ చేయడం సాధ్యం కాకపోయినా, ప్రభుత్వ అనుమతులు, బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగాదశలవారీగా Regular Recruitmentకొనసాగుతుందని చెప్పారు.
కొత్త బస్సులు సంస్థలోకి వచ్చే కొద్దీ వాటికి అవసరమైన సిబ్బంది నియామకాలు కూడా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
క్రూ సిబ్బందిపై దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు
స్త్రీ శక్తి పథకం అమలు నేపథ్యంలో క్రూ సిబ్బందిపై జరుగుతున్న దాడుల విషయంలో పోలీసు శాఖతో సమన్వయంతో కఠిన చర్యలు తీసుకుంటున్నామని VC&MD తెలిపారు.
ఈ అంశంపై తాను స్వయంగా DGP కార్యాలయానికి వెళ్లి పోలీసు ఉన్నతాధికారులతో చర్చించినట్లు వెల్లడించారు. దాడుల కేసుల దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రత్యేక IPS అధికారిని నియమించినట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాడుల కేసుల దర్యాప్తును వేగవంతం చేసితదుపరి 1–2 నెలల్లో Charge Sheets దాఖలు చేసేలాచర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు
బస్సు రద్దీ, ఆలస్యం, బస్సు నిలపడం వంటి అంశాలపై డ్రైవర్ లేదా కండక్టర్‌పై దాడి చేయడం సమస్యకు పరిష్కారం కాదని VC&MD స్పష్టం చేశారు.
“ప్రయాణికులకు ఏదైనా సమస్య ఉంటే సంబంధిత డిపో మేనేజర్ లేదా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. ఉద్యోగులపై దాడి చేస్తే పోలీసు కేసులు, Charge Sheets నమోదవుతాయి. తద్వారా వారి భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది”అని ఆయన హెచ్చరించారు.
ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు APSRTC సిద్ధంగా ఉందన్నారు.
ఉద్యోగుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
APSRTC ఉద్యోగుల పని పరిస్థితులు, రాత్రి–పగలు విధులు, ఆరోగ్యపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని సంస్థ ప్రత్యేక చర్యలు చేపడుతోందని VC&MD తెలిపారు.
ప్రతి సంవత్సరం సుమారు300 మంది RTC సిబ్బంది మరణిస్తుండగా, వారిలో 200 మందికి పైగా గుండె, కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లుగుర్తించామని తెలిపారు. ఈ నేపథ్యంలోPreventive Health Check-upsను ప్రారంభించి, ప్రస్తుతం ఉద్యోగులందరికీ ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
APSRTC వైద్యులను ప్రతి శుక్రవారం డిపోలకు పంపించి డ్రైవర్లు, ఇతర సిబ్బందికి ఆరోగ్య పరీక్షలతో పాటు ఆరోగ్య అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
విజయవాడ విద్యాధరపురంలోని APSRTC ఆసుపత్రిలోConsulting Cardiologist సేవలను వారానికి రెండు రోజులుఅందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించామని చెప్పారు.
అదేవిధంగా కొత్త జిల్లా కేంద్రాల్లో7 డిస్పెన్సరీలు, విశాఖపట్నంలోArea Hospitalఏర్పాటుకు చర్యలు ప్రారంభించామని వెల్లడించారు.

ఉద్యోగుల సంక్షేమం – సంస్థ అభివృద్ధే లక్ష్యం
APSRTC యాజమాన్యం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని VC&MD తెలిపారు.
“సంస్థ లక్ష్యాలను సాధించడంతో పాటు ఉద్యోగులకు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా వారి సమస్యలను పరిష్కరించడం మా ప్రధాన ఉద్దేశం. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై పరస్పర విశ్వాసంతో, సామరస్యపూర్వకంగా చర్చించి పరిష్కారాలు సాధించాం”అని ఆయన పేర్కొన్నారు.
ఈ సమావేశంలో APSRTC Executive Directors, ఇతర ఉన్నతాధికారులు, JAC ప్రతినిధులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *