Breaking News

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ 4జీతో ప్రత్యేక ఆఫర్లు : సీజీఎం శేషాచలం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వినియోగదారులకు పలు ప్రత్యేక ఆఫర్లు, కొత్త సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు ఏపీ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎం. శేషాచలం అన్నారు. శుక్రవారం విజయవాడ చట్టుగుంటలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆఫర్లు, కొత్త సేవల గురించి మీడియా వివరించారు. రూ.1 బీఎస్ఎన్ఎల్ ఫ్రీడమ్ 2.0 మొబైల్ ఆఫర్: రోజుకు 1 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు, అపరిమిత వాయిస్ కాల్స్ తో 47 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు చెప్పారు. రూ.2,399 వార్షిక ప్లాన్పై అదనంగా 47 రోజుల వ్యాలిడిటీతో మొత్తం 412 రోజులు లభిస్తుందని తెలిపారు. రూ.1,111 ఫైబర్ ఫ్రీడమ్ ప్లాన్ ద్వారా 200 ఎంబీపీఎస్ వేగం, 5,000 జీబీ డేటా, 25కు పైగా ఓటీటీ ప్లాట్ ఫారమ్ లు, అపరిమిత వాయిస్ కాలింగ్ అందిస్తున్నట్లు చెప్పారు. రూ.499 ఫైబర్ బేసిక్ ప్లాన్ తీసుకునే కొత్త వినియోగదారులకు మొదటి నెల ఉచిత సేవతో పాటు రూ.300 డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా స్వదేశీ సాంకేతికతతో 4జీ సేవలను విస్తరిస్తున్నామని, దేశవ్యాప్తంగా సుమారు లక్ష టవర్లు ఉండగా ఏపీలో 6,850 టవర్లు, 15 వేల బీటీఎస్లు ఉన్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో సాచురేషన్ ప్రాజెక్ట్ కింద 1,359 టవర్ల ద్వారా 2,641 మారుమూల గ్రామాలకు 4జీ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. బీఎస్ఎన్ఎల్–పాలీక్యాబ్ భాగస్వామ్యంతో మేడ్ ఇన్ ఇండియా టెలికాం పరికరాల తయారీని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. ఈ-సిమ్, యూనివర్సల్ సిమ్, ఎంటర్టైన్మెంట్ టీవీ, శాటిలైట్ ఫోన్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *