Breaking News

చిత్రాలలో చాటిన దేశభక్తి గ్రంథాలయంలో చిత్రలేఖనం పోటీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక మహాత్మా గాంధీ రోడ్డులోని ఠాగూర్ గ్రంథాలయంలో ఆదివారం విద్యార్థులకు చిత్రలేఖనం పోటీ నిర్వహించబడింది. దేశం అనే అంశంపై
ఈ కార్యక్రమం  స్వాతి పూర్ణిమ సహకారంతో గ్రంథాలయ అధికారి కే రమాదేవి నిర్వహించెను.
రమాదేవి మాట్లాడుతూ చిన్నారులు దేశం పై చిత్రలేఖనoఎంతో అద్భుతంగా వేశారు .
గ్రంథాలయంలో పుస్తక పఠనంతో పాటు సృజనాత్మకత
వెలికి తీయటం కోసం కాంపిటీషన్స్ పెట్టడం జరుగుతుంది. ఇటువంటి కాంపిటీషన్ పెట్టడం వల్ల విద్యార్థుల్లో దేశం పై ప్రేమ ,గౌరవం, బాధ్యత ,ఐక్యత వంటి భావం పెరుగుతాయి.
అంతేకాక క్రమశిక్షణ స్నేహభావం, పోటీ తత్వ స్ఫూర్తి మంచి విలువలు వస్తాయి అని తెలియజేశారు.
అనంతరం పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందచేయుట జరిగినది.
స్వాతి పూర్ణిమ గారు విద్యార్థులందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు.
విజేతల వివరాలు
సబ్ జూనియర్స్
1. తాన్యశ్రీ
2. దుర్గ మల్లేశ్వరి
3. రోజా
జూనియర్స్ విభాగం
1. శ్రీనిజ
2. మహాలక్ష్మి
3. వాగ్దేవి
సీనియర్స్ విభాగం
1. వేదాన్షి
2. రూప్సా దాస్
3. లాస్య
ఈ కార్యక్రమంలో వివిధ స్కూల్స్ విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కాకినాడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

-జాతీయ జెండాను ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ కాకినాడ, నేటి పత్రిక ప్రజావార్త : కాకినాడ పోలీస్ పరేడ్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *