విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంద్రకీలాద్రి పై కొలువైన అమ్మవారిని మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి శనివారం దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఈ ఓ సీనా నాయక్ , ఆలయ చైర్మన్ బొర్రా రాధ కృష్ణ (గాంధీ ), ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు పెనుగొండ సుబ్బారాయుడు, ట్రస్ట్ బోర్డు మెంబర్ అవ్వారు శ్రీనివాసరావు తదితరులు స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
Prajavartha Online Telugu News