-అన్న అనే మాటను సార్థకం చేసుకుని..
పుట్టింటి కానుకగా చీర-సారె, పసుపు, కుంకుమ అందజేసిన పేదల పెద్దన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే..
హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
పోషకాహార వారోత్సవంలో భాగంగా నవయువ నిర్మాణ్ సంస్థ మరియు కాంగ్రెస్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్‌గూడ మహమ్మద్ ఫంక్షన్ హాల్‌లో సామూహిక శ్రీమంతాలు,అన్నప్రాసన కార్యక్రమాన్ని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 2,000 మంది గర్భిణీ మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో హాజరై సందడి చేశారు.
కాబోయే తల్లులకు ఆరోగ్యం, ఆనందం, ఆయురారోగ్యాలతో నిండిన జీవితం కలగాలని ఆకాంక్షిస్తూ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ పుట్టింటి కానుకగా చీర-సారెతో పాటు పసుపు, కుంకుమ అందజేసి సామూహికంగా శ్రీమంతం చేశారు. అన్నగా అండగా నిలిచి.. ఆడపడుచుల పట్ల తనకున్న ఆప్యాయతను చాటుకుంటూ, పేద కుటుంబాలకు చెందిన మహిళలకు అండగా నిలిచేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేశారు.. అదేవిధంగా చిన్నారి తొలిసారిగా అన్నం రుచి చూసే మధురమైన, చిరస్మరణీయమైన అన్నప్రాసన కార్యక్రమాన్ని గద్వాల్ విజయలక్ష్మి, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ కలిసి నిర్వహించి చిన్నారులకు ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమనికి TPCC అధ్యక్షులు, మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు,దుద్ధిల్లా శ్రీధర్ బాబు, సీతక్క, అజ్జరుద్దీన్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు గద్వాల విజయలక్ష్మి,మైనార్టీ నాయకులు ఫాహీం ఖురేషి ..ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ మధుయాష్ గౌడ్ , MLC అద్దంకి దయాకర్ .. ఎమ్మెల్యేలు, దానం నాగేందర్ , మరియు ఉత్తమ్ పద్మావతి రెడ్డి ,చిత్తం పర్ణిక రెడ్డి , యశస్విని రెడ్డి, టీజీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ సామ రామ్మోహన్ రెడ్డి , గద్దర్ వెన్నెల , కాల్వ సుజాత గారు, కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి, దీపక్దీపక్ జాన్ ,సరిత తిరుపతయ్య , ఉత్తర కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యులు,తదితరులు, హాజరయ్యారు..
Prajavartha Online Telugu News