హైదరాబాద్, నేటి పత్రిక ప్రజావార్త :
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వి. నవీన్ యాదవ్ ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో బైక్ ర్యాలీలో పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News