-25వ వార్షికోత్సవ వేడుకల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
-అక్షర విద్యాలయ పరిపాలన భవనం సందర్శన
-సాంకేతిక శిక్షణ కేంద్రంలో యువత నైపుణ్యాలపై ఆరా
-వెంకయ్య నాయుడు, సుజనా చౌదరి తదితరుల ఘన స్వాగతం
-సర్దార్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
స్వర్ణ భారత్ ట్రస్ట్ 25వ వార్షికోత్సవ వేడుకల్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నెల్లూరు సరస్వతి నగర్‌లోని అక్షర విద్యాలయ పరిపాలన భవనానికి చేరుకున్న ఆయనకు మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు, స్వర్ణ భారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్, వెంకయ్య నాయుడు కుమారుడు హర్షవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి), ఏపీ భాజపా అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రులు నారాయణ, సత్యకుమార్, కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం యోగి ఆదిత్యనాథ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం సోమా సాంకేతిక శిక్షణ కేంద్రాన్ని సందర్శించి, యువతకు అందిస్తున్న సాంకేతిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సేవా కార్యక్రమాలను యోగి ఆదిత్యనాథ్ ప్రశంసించారు. ,అక్షర విద్యాలయం ద్వారా అందిస్తున్న విద్యా సేవలను అభినందించారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా ఉపాధి అవకాశాలకు బాటలు వేస్తున్న కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.
Prajavartha Online Telugu News