Breaking News

విజయవాడలో సరికొత్త పల్సర్ 125 & పల్సర్ 150 ఆవిష్కరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతదేశపు ఐకానిక్ స్పోర్ట్స్ మోటార్‌ సైకిల్ బ్రాండ్ బజాజ్ పల్సర్, తన 25 ఏళ్ల అద్భుతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సరికొత్త పల్సర్ 125 మరియు పల్సర్ 150 మోడళ్లను విజయవాడలో ఆవిష్కరించింది. వరుణ్ బజాజ్ విజయవాడ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రత్యేక ఆవిష్కరణ కార్యక్రమానికి విజయవాడ టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 2001లో పల్సర్ 150తో ప్రారంభమైన పల్సర్ ప్రయాణం భారతీయ మోటార్‌ సైక్లింగ్ రంగంలో స్పోర్టీ డిజైన్, పనితీరు మరియు రైడింగ్ అనుభవానికి కొత్త ప్రమాణాలను తీసుకొచ్చిందని, అలాగే 25 ఏళ్లుగా కోట్లాది రైడర్ల అభిమానాన్ని సొంతం చేసుకున్న పల్సర్, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీ, మెరుగైన ఇంజినీరింగ్ మరియు మరింత ఆధునిక డిజైన్‌తో కొత్త తరం రైడర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైందని వివరించారు
బజాజ్ కంపెనీ సేల్స్ ఎఎస్ఎం సదత్ బాషా మాట్లాడుతూ సరికొత్త పల్సర్ 125లో 12 పిఎస్, 11 ఎనఎం టార్క్ తో మరియు పల్సర్ 150-ఐకానిక్ మోడల్‌కు కొత్త రూపు ఇస్తూ కొత్త పల్సర్ 150 సిసిలో 14 పిఎస్ గరిష్ట శక్తి మరియు 13.7 ఎన్ఎం గరిష్ట టార్క్ను, కొత్త ఇంజిన్ మరియు గేర్‌బాక్స్ కలయిక నగర రోడ్లపై స్మూత్ యాక్నిలరేషన్‌తో పాటు మెరుగైన లో`స్పీడ్ పెర్‌ఫార్మాన్స్‌ను అందించేలా రూపొందించబడిందని తెలిపారు
బజాజ్ కంపెనీ సర్వీస్ ఎఎస్ఎం హిమంత్ గోవర్ధన్ మాట్లాడుతూ కొత్త డైమండ్-టైప్ ఫ్రేమ్ మరియు నైట్రోజన్ గ్యాస్-ఛార్జిడ్ మోనోషాక్ సస్పెన్షన్ ద్వారా హ్యాడ్లింగ్, స్టెబిలిటీ మరియు ఇప్పటి వరకూ 125 సిసిలలో ఇండస్ట్రీ లో మొదటిగా 3 రైడ్ మోడ్స్ ప్రవేశ పెట్టినట్టు, 5 ఇంచ్ టిఎఫ్‌టి కన్సోల్, మోనో నైట్రాక్స్ సస్పెన్షన్‌తో మరింత టెక్నాలజీ, క్వాలిటీతో వాహనాన్ని రూపొందించామని తెలిపారు.
ఈ సందర్భంగా వరుణ్ బజాజ్ విజయవాడ ప్రతినిధులు మాట్లాడుతూ, కొత్త పల్సర్ 125 మరియు పల్సర్ 150 విజయవాడలోని పల్సర్ అభిమానులకు మరింత మెరుగైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తాయని, 25 ఏళ్ల పల్సర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ కొత్త అధ్యాయానికి నాంది పలుకుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వరుణ్ బజాజ్ బిజినెస్ హెడ్ కె.వి.రామారావు, జీఎం పద్మజా, షోరూం మేనేజర్ తులసీ రావు, సిబ్బంది మరియు కస్టమర్‌లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *