Breaking News

గవర్నర్‌పేటలో హోటళ్లు, మెస్‌లపై ముమ్మర తనిఖీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు ప్రజారోగ్య విభాగం అధికారులు మంగళవారం ఉదయం గవర్నర్‌పేట ప్రాంతంలో హోటళ్లు, మెస్‌లు, ఆహార విక్రయ కేంద్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా గవర్నర్‌పేటలోని రామయ్య మెస్, కోటయ్య మెస్, సుబ్బయ్య మెస్, హవెలి హోటల్ తదితర ఆహార విక్రయ కేంద్రాలను తనిఖీ చేసి ఆహార పదార్థాల నాణ్యత, పరిసరాల పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, వంటగది పరిశుభ్రత, సిబ్బంది వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించారు.

నిబంధనలు పాటించని ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులకు జరిమానాలు విధించారు. అందులో భాగంగా హవేలీ హోటల్ కు 5000 రూపాయల జరిమానా మరియు రామయ్య మెస్సుకు నోటీసులు జారీ చేశారు. ఆహార పదార్థాలను పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసి, నాణ్యమైన ఆహారాన్ని మాత్రమే ప్రజలకు అందించాలని అధికారులు సూచించారు. హోటళ్లు, మెస్‌లు, టిఫిన్ సెంటర్లు, ఆహార విక్రయ కేంద్రాల నిర్వాహకులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలను పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వారిపై జరిమానాలతో పాటు అవసరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

ఈ తనిఖీల కార్యక్రమంలో శానిటరీ సూపర్వైజర్లు సలీం అహ్మద్ , శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రజారోగ్య విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *