Breaking News

రాష్ట్ర ఆర్థిక వృద్ధికి జిల్లాలే చోదక శక్తులు

-అవకాశాలను అన్ లాక్ చేస్తేనే జీఎస్డీపీ లక్ష్యం సాధ్యం
-పెట్టుబడుల్ని ఆకర్షించేలా అక్టోబరులో ప్రాంతీయ సదస్సులు
-8వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు
-2026–27 వృద్ధిరేటు అంచనా 13.44 శాతంగా నమోదైందన్న అధికారులు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరుకునేలా జిల్లాల్లో ఉన్న అవకాశాలను అన్‌లాక్ చేయాలని, స్థానిక వనరులను సమర్థంగా మార్కెటింగ్ చేసుకుని సంపద సృష్టించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. జిల్లాల వారీగా వృద్ధి సమాచారాన్ని మంత్రులు, కలెక్టర్లకు అందించేలా ఆర్టీజీఎస్ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పెట్టుబడుల గ్రౌండింగ్, జీఎస్‌డీపీ సహా వివిధ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. ధరల సూచీ సహా వివిధ అంశాలను పరిగణించేందుకు 2022-23ను బేస్ ఇయర్ గా కేంద్రం నిర్ధారించిందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ధరల మేరకు 2026–27 వృద్ధిరేటు అంచనా 13.44 శాతంగా నమోదైందని వెల్లడించారు. వ్యవసాయ అనుబంధ రంగాల జీవీఏ వృద్ధిరేటు 2026–27 తొలి త్రైమాసికంలో 14.19 శాతానికి పెరిగిందని, పరిశ్రమల రంగంలో 14.81 శాతం, సేవల రంగంలో 12.70 శాతం వృద్ధి నమోదైందని వివరించారు. అక్వా రంగంలో 6.61 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో 31.77 శాతం వృద్ధి నమోదైందన్నారు.

14.28 శాతం పెరిగిన విద్యుత్ వినియోగం

విద్యుత్ ఉత్పత్తి 24,248 మిలియన్ యూనిట్ల నుంచి 28,664 మిలియన్ యూనిట్లకు పెరిగిందని, విద్యుత్ వినియోగం 14.28 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. ఇక పారిశ్రామిక ఉత్పత్తిలో తొలి త్రైమాసికంలో రూ.1,13,638 కోట్ల జీవీఏ నమోదైందని, సేవల రంగంలో 2026–27 తొలి త్రైమాసికానికి రూ.1,60,107 కోట్ల జీవీఏ నమోదైందని వివరించారు. జీఎస్టీ ఆదాయంలోనూ 18 శాతం మేర పెరుగుదల నమోదైందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్‌ఫోర్స్ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిందని తెలిపారు. ఇప్పటివరకు జరిగిన 20 రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, రూ.13.85 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు, 10.6 లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎస్ఐపీబీ సమావేశాల్లో ఆమోదం పొందిన ప్రాజెక్టుల్లో ఇప్పటికే 160 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయని, రూ.4.03 లక్షల కోట్ల పెట్టుబడులతో 5.9 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఎస్ఐపీబీలో అనుమతులు పొందిన ప్రాజెక్టులను వేగంగా గ్రౌండ్ చేసేలా జిల్లా కలెక్టర్లు ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ప్రాజెక్టుల ప్రారంభ తేదీలను కూడా ఖరారు చేయాలని, ప్రాజెక్టులు గ్రౌండ్ కావడంలో మంత్రులు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని ఆదేశించారు.

ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహం

రాష్ట్రంలో ప్రస్తుతం తయారీ, సేవలు, వాణిజ్య రంగాల్లో 23.85 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయని అధికారులు తెలిపారు. 175 ఎంఎస్ఎంఈ పార్కులకు గాను ఇప్పటికే 138 పార్కులకు ఆమోదం లభించిందని, 22 పార్కులు ప్రారంభమయ్యాయని, మిగతా 116 పార్కులు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు. వీటి ద్వారా రూ.2,036 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉండగా, 31,163 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది పెట్టుబడుల సదస్సులో భాగంగా విశాఖ, కాకినాడ, అమరావతి, అనంతపురం, తిరుపతిలో సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు అక్టోబరులో ప్రాంతీయ కాన్ఫరెన్సులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా నవంబరులో 2026 భాగస్వామ్య సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న హెలిప్యాడ్‌లను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వీటిని పర్యాటక రంగంతోనూ అనుసంధానించే అవకాశం ఉంటుందని సూచించారు. జిల్లా కేంద్రాల్లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీలను ప్రారంభించేలా కేంద్రం నుంచి అనుమతులు పొందేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని తెలిపారు. ఆర్వోబీలు, ఆర్యూబీల నిర్మాణానికి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. జిల్లాల్లో అభివృద్ధి, పెట్టుబడులు, మౌలిక వసతుల పురోగతిని సమన్వయం చేస్తూ లక్ష్యాలను వేగంగా సాధించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో మంత్రి అచ్చెన్నాయుడికి వరుసగా మూడోసారి మొదటి స్థానం

-వేగవంతమైన ఫైళ్ల పరిష్కారం.. సమర్థవంతమైన పనితీరుకు సీఎం చంద్రబాబు ప్రశంసలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఈ-ఫైల్స్ క్లియరెన్స్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *