Breaking News

ఫ్యామిలీ కాన్షప్టు విధానం ద్వారా పేదవాడిఇంటి ముంగిటకే మెరుగైన వైద్యసేవలు.


-దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉచిత ఆరోగ్య సేవలు…
– పేద ప్రజల ఆరోగ్య భద్రత ప్యామిలీ కాన్షప్టు..
– ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
– రాష్ట్ర హోమ్ మంత్రి డా. తానేటి వనిత,
-జిల్లా కలెక్టర్, డా. కె. మాధవి లత.
కొవ్వూరునేటి పత్రిక ప్రజావార్త :
ప్రజలకు ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించేలా ఫ్యామిలీ కాన్షప్టు విధానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి పేద ప్రజల ఆరోగ్య భద్రతకు పెద్ద పీట వేస్తున్నారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు.గురువారం ఫ్యామిలీ డాక్టర్ విధానం అనే మహోన్నత కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం, లింగంగుంట్ల గ్రామం నుండి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయ్యేలా లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం కొవ్వూరు మండలం కాపవరం నుంచి ప్రారంభించగా రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ గత అక్టోబర్ 21 నుంచి ప్యామిలీ డాక్టరు విధానం ప్రజలకు ప్రయోగాత్మకంగా అందిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయిలో నేటి నుంచి వైద్య సేవలు ప్రజల ముంగిటకు మన రాష్ట్ర ప్రభుత్వం 104 వాహనాల ద్వారా అందిస్తున్నదన్నారు. దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్. రాజశేఖరరెడ్డి ఆరోగ్య ప్రవేశపెట్టి పేద ప్రజలకు కార్పోరేట్ ఆస్పత్రుల్లో ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని అందించి వారి హృదయాల్లో దేవుడిగా నిలిచారన్నారు. అదే ఒరవడిలో నేడు సీయం వైఎస్. జగన్మోహన్ రెడ్డి వైద్య శాఖలో ఎన్నో వినూత్నమైన మార్పులు తెచ్చి వేల సంఖ్యలో ఉద్యోలను భర్తీ చేశారన్నారు. అనేక వ్యాధులను ఆరోగ్యశ్రీలో చేర్చడమే కాకుండా దీర్ఘకాలిక వ్యాధులతో భాదపడుతున్న వారికి పెన్షన్ అందించి వారికి ఆర్థిక భరోసాను కల్పించారన్నారు.జగనన్న పాలనలో ఆరోగ్యానికి భరోసా ఇస్తూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా తీర్చి దిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నా మన్నారు. ఆధునిక వైద్య సేవలు మీ సొంత ఊరిలో, సొంత గడపలో అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్మో హన్ రెడ్డి ఆధ్వర్యలో ప్రారంభి స్తున్న మరో బృహత్తర పథకం ‘ఫ్యామిలీ డాక్టర్’ పథకం అన్నారు. గ్రామాల్లో నివసించే పేదలకు మెరుగైన ఆరోగ్య భద్రత కల్పించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఈ పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏదైన అనారోగ్యా నికి గురైతే చాలా ఇబ్బందులు వారిని నేడు ప్యామిలీ డాక్టరు విధానంతో ఆ పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,875 మంది వైద్యులు, 10,032 మంది ఏఎన్ఎంలు, 37,017 మంది ఆశా వర్కర్లు ఫ్యామిలీ డాక్టర్ పథకం ద్వారా వైద్య సేవలు అందిస్తారన్నారు. అలాగే పీహెచ్సీలు, సీహెచ్సీలు, వైఎ స్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లకుతోడు 108, 104 వాహనాలు ఈ పథకంలో గ్రామాలకు వెళ్లి సేవలు అందిస్తాయని వివరించారు. ఇప్పటికే నాలుగువేల వ్యాధులను ఆరోగ్య శ్రీ పరిధి లోకి తీసుకురావడం, పొరుగు రాష్ట్రాల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు పొందే అవకాశం కల్పించారన్నారు. నాలుగేళ్లలో వైద్య, ఆరోగ్య రంగంలో అనేక సంస్క రణలు తీసుకొచ్చి, పేదవారి ఆరోగ్య భద్రత కోసం ఈ స్థాయిలో ఆలోచించిన ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు. ప్రతీ గ్రామంలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్ స్థాపించి, ఆయా సచివాలయాలకు అనుసంధానించడం ద్వారా పనిచే సేలా చర్యలు తీసుకున్నారని వివరించారు.జిల్లా కలెక్టర్ డా.కే.మాధవీలత మాట్లాడుతూ ప్రతి మండలంలో రెండు పబ్లిక్ హెల్త్ సెంటర్లు ఉంటాయని, ప్రతీ సెంటర్లో ఇద్దరు క్వాలీపైడ్ వైద్యులు, అవసర మైన సిబ్బందితో పాటు, మౌలిక సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్ సీ), రెవెన్యూ డివిజన్ కు ఒక ఏరియా ఆసుపత్రి ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. వైద్య వృత్తి పవిత్రమైన వృత్తి అన్నారు. గ్రామాల్లో ఆనారోగ్యంతో ఉన్నవారిని, గర్భవతులను, పాఠశాలల పిల్లను గుర్తించి వారికి పరీక్షలు నిర్వహించాలన్నారు. కాన్పుసమయంలో తల్లులు కాపాడే విధంగా వైద్య పరమైన పరీక్షలు నిర్వహించాలన్నారు. హైరిస్కు, అనిమియా రోగులకు ముందు గానే గుర్తించి వారికి వైద్య సేవలందించాలన్నారు. జిల్లాలో ప్యామిలీ డాక్టరు కాన్షప్టు గత మూడు మాసాలుగా నిర్వహిస్తున్నామన్నారు. వారానికి 5 వేల మంది రోగులు వరకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. వైద్య రంగాన్ని మరింత పటిష్ఠ పర్చడంలో భాగంగా ఒకపక్క 108 వాహనాలను పెద్ద సంఖ్య లో సమకూర్చితే, మరోపక్క ప్రజలకు ఆరోగ్యసేవలు అందించడానికి 104 వాహనాలను పెద్ద సంఖ్యలో ప్రవేశపెట్టారని వివరించారు. ప్రతి పీహెచ్ సీ కి అనుబంధం గా ఒక 104 వాహనం కేటాయించి, ఆ వాహనం ప్రతి గ్రామంలోని ఇంటింటికి వెళ్లి, ఆరోగ్య సంబంధిత పరీక్షలు చేయడంతోపాటు అవసరమైన మందులు కూడా అందిస్తారన్నారు. ప్రజలంతా ఫ్యామిలీ డాక్టర్ పథకం సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు,వాలంటీర్లు ద్వారా ప్రజలకు ఫ్యామిలీ డాక్టర్ పధకం గురించి విస్తృత ప్రచారం చేపట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎ. ఎం. సి. చైర్మన్, ఏఎంసీ చైర్మన్ వల్లభ శెట్టి శ్రీనివాస్, జిల్లా పరిషత్ వైస్ చైర్ పర్సన్, పోసిన శ్రీలేఖ, ఎం పి.పి, కాకర్ల నారాయణుడు,(సత్యనారాయణ ), బండి పట్టాభి రామారావు, డి.ఎం.హెచ్.ఓ,డా. కె. వెంకటేశ్వర రావు, కొవ్వూరు ఆర్డీఓ, ఎస్.మల్లిబాబు, డిప్యూటీ డి.ఎం.హెచ్.ఓ, జి.వరలక్ష్మి, మెడికల్ అధికారులు, ఎస్.ధర్మ రాజు, బి.శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *