రాజమహేంద్రవరం నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ మరియు డి.ఎం.హెచ్.ఓ, రాజమహేంద్రవరం సంయుక్త ఆధ్వర్యంలో స్థానిక గౌతమి జీవ కారుణ్య సంఘం నందు గురువారం ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి. కె. ప్రత్యూష కుమారి పేర్కొన్నారు.ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ కె. ప్రత్యూష కుమారి వృద్ధులతో మాట్లాడుతూ వృద్ధాప్యంలో పలు అనారోగ్య సమస్యలు రావడం సహజమే కానీ ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకుంటూ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలియజేశారు. ఈ వైద్య శిబిరంలో ఈ.సీ.జీ., బీ.పీ, షుగర్ మరియు మొదలగు పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఆశ్రమవాసులందరు వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. పరీక్షల అనంతరం వృద్ధులకు మందులు అందజేసినట్లు తెలిపారు.ఈ వైద్య శిబిరంలో వివిధ విభాగాల వైద్యనిపుణులు డా. వంశీ, డా. పవన్ కిశోర్, డా. మేరీ వసంత, డా. మృదుల, మెడికల్ ఆఫీసర్లు డా. మనోజ్, డా. లలిత, ల్యాబ్ టెక్నీషియన్లు, ఆశా కార్యకర్తలు, పానెల్ లాయర్ వి. సుజాత, పారా లీగల్ వాలంటీర్ ఎమ్.శ్రీను పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News