Breaking News

జగనన్న సురక్ష పై శిక్షణా తరగతులు జూన్ 17 నుంచి 20 వరకు

-గ్రామ సభలు జూన్ 23 నుంచి జూలై 23 వరకు నిర్వహించాలి
-మంగళ, గురు, శుక్రవారం లో గ్రామ సభలకు ఏర్పాటు చేయాల్సి ఉంటుందికలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం  నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న సురక్ష కింద నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.శుక్రవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరం నుంచి మండల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ లతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వాలంటీర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు , అధికారులు ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం గురించి గృహ సారధి’లు ప్రతి ఇంటికి వెళ్లి వివరించాల్సి ఉంటుందన్నారు. క్షేత్ర స్థాయి వరకు జగనన్న సురక్షా తీసుకుని వెళ్ళే బాధ్యత సంబందించిన బృందాలదే అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇందుకోసం క్షేత్ర స్థాయి సిబ్బందికి మండల పరిధిలో జూన్ 17 నుంచి 20 వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలియ చేశారు. గ్రామ సభలు నిర్వహించే క్రమంలో మంగళవారం, గురువారం, శుక్రవారం రోజుల్లో నిర్వహించాలని అన్నారు.సచివాలయం ద్వారా 534 సేవలు అందించడం జరుగుతోంది ఆమేరకు అర్జీల స్వీకరణ చేపట్టి పరిష్కారం కోసం చర్యలు సంబంధిత అధికారులు తో కూడి అడుగులు వేయడం ముఖ్యం అన్నారు.మరణాలు, ఆదాయ, వివాహ ధృవీకరణ పత్రాలు, ప్రభుత్వ పథకాలు , ఇతర కార్యక్రమాలకు సంబంధించిన సమస్యలపై ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని తెలిపారు. ఏ ఒక్క పిటిషన్‌ను కూడా పట్టించు కోకుండా వదిలి వేయకూడదని ఆదేశించారు.
ఇందుకోసం గ్రామీణ, పట్టణ పరిధిలో రెండు బృందాలను ఏర్పాటు చేయాలని మాధవీలత స్పష్టం చేశారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, డిప్యూటీ తహశీల్దార్‌లు ఒక బృందం, తహశీల్దార్‌, పంచాయతీరాజ్‌ ఈఓలతో కూడిన మరో బృందాన్ని ఏర్పాటు చేయ్యాల్సి ఉంటుందన్నారు. అదే విధంగా పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్ మరియు సిబ్బంది ఒక బృందంలో, జోనల్ కమిషనర్ లేదా డిప్యూటీ కమిషనర్ మరియు సిబ్బంది మరొక బృందంలో సభ్యులుగా ఉండాలని పేర్కొన్నారు.  ఈ బృందాలు ఆయా వార్డులను సందర్శించి దరఖాస్తులు స్వీకరించాలని తెలియచేశారు.జూన్ 23 నుండి జూలై 23 వరకు అర్జీలను స్వీకరించడం, సంబంధిత సమస్యలను గుర్తించడం జరగాలని , వాటిని ఆన్లైన్ లో డిజిటల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ చెయ్యాల్సి ఉంటుందన్నారు. ఈ క్రమంలో స్వీకరించిన అర్జీలపరిష్కారం ఎటువంటి సేవ రుసుం వసూలు చెయ్యకుండా పరిష్కారం చెయ్యాల్సి ఉంటుందని తెలిపారు.’జగనన్న సురక్ష’ కింద వివిధ పథకాల కోసం గుర్తించిన లబ్ధిదారులకు ఆగస్టు 1 న ప్రయోజనాలను అందజేస్తారు. “ఏ పథకం నుండి అర్హత ఉన్న ఎవరూ మిగలకుండా చూసుకోవడమే ప్రధాన లక్ష్యం గా పనితీరు చూపాలని ఆమె పేర్కొన్నారు.కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *