Breaking News

ఎఫ్ సి ఐ గోడౌన్ లో ఈ వి ఎం భద్రపరచుటకు గోడౌన్ పరిశీలన కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరంనేటి పత్రిక ప్రజావార్త :

నూతనంగా ఏర్పాటు చేసిన తూర్పు గోదావరి జిల్లా కు చెందిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్ర పరికరాలు భద్రపరచడానికి అనువుగా ఉండే విధంగా గోడౌన్ ను గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత తెలిపారు.శుక్రవారం ఉదయం లాలా చెరువు దగ్గర ఉన్న ఎఫ్ సి ఐ వేర్ హౌసింగ్ గోడౌన్ ను జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఆర్వో జి.నరసింహులు , ఆర్ అండ్ బి అధికారులు ఎస్.ఈ ఎస్బివి రెడ్డి, డిఈ బివివి మధుసూధన రావు, డిటి పవన్ కుమార్, తదితరులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, జిల్లా కొత్తగా ఏర్పాటు చేసిన తరువాత జిల్లా కేంద్రంలో ఎన్నికల నిర్వహణ కోసం ఈ వి ఎమ్ లు భద్రపరిచేందుకు తగిన గోడౌన్ సదుపాయం అందుబాటులోకి తీసుకుని రావాల్సి ఉంటుందన్నారు. ఆక్రమంలో లాలా చెరువు సమీపంలో కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఫుడ్ కార్పొరేషన్ ఇండియాయొక్క గోడౌన్ ను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ గోడౌన్ లో ఎన్నికల ఓటింగ్ యంత్ర పరికరాలు భద్రపరచాల్సి ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా పటిష్ఠమైన భద్రత కల్పించి చేపట్టవలసిన నిర్మాణాలపై ఆర్ అండ్ బి అధికారులకు దిశా నిర్దేశనం చేశారు. భవనం లోపల ఎటువంటి విద్యుత్ వైరింగ్ ఉండకూడదని, వాటిని తొలగించాలని ఆదేశించారు. జిల్లా పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానంకు సరిపడే ఈ వి ఎం లు భద్ర పరచాల్సి ఉంటుందని తెలియచేశారు. గొడౌన్ అంతర్గతంగా చేపట్టవలసిన పనులు, ఇతర అంశాలపై సూచనలు చేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *