Breaking News

ఓటరు జాబితా మేరకు ఇంటింటి సర్వే నిర్వహించడంలో అత్యంత పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ స్పష్టం చేశారు.

 

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త:
బుధవారం సాయంత్రం మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సహాయ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తి కలిసి కమిషనర్ బి ఎల్ వో లు, సూపర్ వైజర్ తో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా దినేష్ కుమార్ మాట్లాడుతూ జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బి ఎల్ వో లు వారి పరిధిలోని ప్రతి ఒక్క ఇంటిని సందర్శించి, ఓటరు జాబితా మేరకు ఓటర్ల ను గుర్తించాలని కోరారు. ఈ క్రమంలో నిబద్దత తో కూడిన సేవలు అందించాలన్నారు. మరణించిన వారి పేర్ల తొలగించాలని ఆదేశించారు. వేరే ప్రాంతానికి వెళ్లిన వారి పేర్ల చిరునామా మేరకు నమోదు చేసే విధానం చేపట్టాలని సూచించారు. బి ఎల్ వో తో పాటు రాజకీయ పార్టీలు నిర్ధారించిన బూత్ లెవెల్ ఏజెంట్ కూడా సర్వే నిర్వహించే సమయంలో పాల్గొనడం జరుగుతుందని, వారికి తగిన గుర్తింపు కార్డు ఇవ్వడం తో4 వారి వివరాలు అందచెయ్యడం జరిగిందన్నారు. ఎస్ ఎస్ ఆర్ 2024 కు చెంది రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆమేరకు 2024 జనవరి 5 న ప్రకటించే ఓటరు జాబితా పారదర్శకంగా ఉండే విధానం లో ఇప్పటి నుంచి వివిధ దశల్లో చేపట్టే ప్రక్రియ ఎంతో కీలకం అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ల ఓటరు గుర్తింపు ప్రక్రియలో నియామకం చేసిన సూపర్ వైజెర్స్, బి ఎల్ వో ఇతర అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *