రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త :
77వ స్వాత్రంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని తపాలా శాఖ, రాజమండ్రి పోస్టల్ డివిజన్ పరిధిలో గల అన్ని తపాలా కార్యాలయాలలో జాతీయ జెండాల అమ్మకాలు ఈరోజు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయని రాజమండ్రి పోస్టల్ డివిజనల్ సూపరింటెండెంట్ పి.కోమల్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత ను మర్యాదపూర్వకముగా కలిసి తపాలా శాఖ తరపున జాతీయ జెండాను బహుకరించారు.ఈ సందర్భముగా పి.కోమల్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంచే ప్రారంభించబడిన “హర్ ఘర్ తిరంగా” కార్యక్రములో భాగముగా దేశ ప్రజలు అందరూ 77 వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు జాతీయ జెండాను ఎగురవేయాలనే సంకల్పముతో ఈ కార్యక్రమం కొనసాగుతోందని తెలిపారు. ఒక్కొక్క జెండా విలువ రూ.25లని మరియు జెండా కొలత 20×30 అంగుళాలని, జెండాలు కావలసిన వారు తమ సమీప పోస్టాఫీసులలో కొనుగోలు చేయవచ్చని, పెద్ద సంఖ్యలో జెండాలు కావలసిన వారు ప్రజా సంబంధాల అధికారి పి.వి.సుబ్బయ్యను ఈ ఫోన్ నెంబరు 7013595065 సంప్రదించాలని ఈ సందర్భముగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ జి నరసింహులు ఉన్నారు.
Prajavartha Online Telugu News