-రూ. 6.46 కోట్లతో చేపట్టిన సోమేశ్వరం – రాజానగరం 6.17 కి.మీ. రహదారి.. తోస్సిపూడి కల్వర్టు ప్రారంభం..
-4 కోట్ల రూపాయలతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభం..
– నా భూమి – నాదేశం శిలాఫలకాన్ని ఆవిష్కరించి ప్రతిజ్ఞచేసిన ..
– కలెక్టరు మాధవీలత, శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మెరుగైన సేవలు గ్రామ స్థాయిలోనే అందించే దిశలో ఆర్బీకేలు, సచివాలయ భవనాలతో కూడి ఇంత చక్కడి కార్యాలయాలు ఏర్పాటు చేయడం ప్రజా సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని జిల్లా కలెక్టరు డా. కే. మాధవీలత పేర్కొన్నారు.బుధవారం సాయంత్రం అనపర్తి నియోజకవర్గం పరిధిలోని గల కొమరిపాలెం గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలను స్థానిక శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలసి కలెక్టరు ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు డా. కే.మాధవీలత మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువలో పరిపాలన అందించాలనే లక్ష్యంతో గ్రామ స్థాయిలోనే సచివాలయ వ్యవస్థ, రైతు సంక్షేమం కోసం ఆర్బీకేలు, గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు డా. వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లను ప్రభుత్వం నిర్మాణం చేపట్టిందన్నారు. ఆ దిశలో శాశ్విత భవనాలను ఏర్పాటు చేయడం ద్వారా కార్యాలయాలకు ఉండవలసిన అన్ని మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. మూడు నెలలు క్రితం కొమరిపాలెంలో పలు అభివృద్ది కార్యక్రమాల పనులను చేపట్టేందుకు రావడం జరిగిందని, పారిశుద్ద్య నిర్వాహణలో గ్రామం తనను ఎంతో ఆకట్టుకుందన్నారు. ఇక్కడి ప్రజా ప్రతినిధులు స్థానిక శాసనసభ్యులు ఈ ప్రాంత అభివృద్ది కొరకు చిత్తశుద్దితో పనిచేస్తున్నారన్నారు.నాభూమి- నాదేశం ..భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడి పిలుపు మేరకు ప్రతిఒక్కరూ మన ప్రాంత అభివృద్ది కొరకు కృషి చేయాలని కలెక్టరు మాధవీలత పిలుపునిచ్చారు. ఆ క్రమంలో కొమరిపాలెం ఎప్పుడూ ఆదర్శంగా నిలుస్తుందన్నారు. మాతృభూమి కోసం జీవించడమే స్వాతంత్ర్య సమరయోధులకు మనం ఇచ్చే ఘనమైన నివాళి అని కలెక్టరు .. శాసనసభ్యులు పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు మనం భావితరాలకు స్వచ్చమైన గాలి, నీరు , సారవంతమైన నేలను అందించి పుడమ తల్లిని కాపాడే భాద్యత మనపై ఉందని ఆ మేరకు అడగులు వేద్దామన్నారు. ఈ సందర్బంగా నా మట్టి – నా దేశం శిలా ఫలకాన్ని ఆవిష్కరించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గ్రామంలోని మట్టిని, నీటినీ సేకరించారు.స్థానిక శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. సచివాలయ వ్యవస్థను తీసుకురావడం ద్వారా పెద్ద ఎత్తున నిరుద్యోగులకు ఉపాధిని కల్పించారన్నారు. ఆర్బీకేలు ద్వారా రైతులకు వారి గ్రామంలోనే మెరుగైన వ్యవసాయ మెలకువులు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తూ విత్తణం నుంచి ధాన్యం కొనుగోలు వరకు ప్రతి విషయంలోను రైతన్నలకు భరోసాను కల్పిస్తున్నారన్నారు. ప్రజారోగ్యానికి పెద్ద పీట పేస్తూ వైఎస్సార్ హెల్త్ క్లినిక్ లు నిర్మాణం చేపడుతున్నామన్నారు.కార్యక్రమంలో డ్వామా పిడి పి. జగదాంబ, జడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి శేషుకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సబ్బెళ్ళ కృష్ణారెడ్డి, గ్రామ అభివృద్ధి ప్రధాత కొవ్వూరి సత్యన్నారాయణ రెడ్డి, ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కొవ్వూరి పాపారెడ్డి, చింతా పాండురంగారెడ్డి, మండల కన్వీనర్ పోతుల ప్రసాద్ రెడ్డి, సర్పంచ్ వాసంశెట్టి రవికుమార్, సొసైటీ చైర్మన్ కొవ్వూరి చిన్నబుజ్జి, ఎంపీటీసి బొబ్బిలి గంగభవాని శ్రీనివాస్, వైఎస్సార్సిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News