-రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో కోటి 36 లక్షల పనులకు శ్రీకారం
-ఎమ్. షర్మిలా రెడ్డి
-చందన నాగేశ్వర్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం గ్రామీణ పరిధిలో రూ. కోటి 36 లక్షల రుడా నిధులతో వివిధ దశలుగా ప్రతిపాదించబడిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు నేడు శ్రీకారం చుట్టినట్లు ఆంధ్రప్రదేశ్ పచ్చదనం మరియు పరిశుభ్రత కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి, పేర్కొన్నారు.ఆదివారం రూరల్ పరిధిలో కోటి 36 లక్షలతో చేపట్టే శంఖుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చందన నాగేశ్వర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, పేద నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం జరుగుతోందని అన్నారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ దిశగా అడుగులు వేయడం జరుగుతున్నట్లు తెలిపారు. రుడా పరిధిని విస్తృత స్థాయి లోపెంచడం ద్వారా తూర్పు గోదావరీ, డా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలో పలు అభివృద్ధి పనులు, సుందరీకరణ పనుల దశల వారీగా చేపట్టి పూర్తి చేసే దిశలో అడుగులు వేస్తున్నట్లు నాగేశ్వర్ తెలిపారు. రూరల్ నియోజకవర్గం లో రుడా నిధులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరగటం చాలా ఆనందదాయకమని ఆయన పేర్కొన్నారు.రుడా చైర్ పర్సన్ మెడపాటి షర్మిలా రెడ్డి మాట్లాడుతూ, నేడు రుడా పరిధిలోని రాజమహేంద్రవరం రూరల్ మండలం లో రుడా నిధులతో ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీ లోని పార్క్ ను ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ పనులకు, కొంతమూరు లో అప్పన్న చెరువు కాంపౌండ్ వాల్ నిర్మాణ, వాకింగ్ ట్రాక్ పనులు, హుకుంపేట హౌసింగ్ కాలనీ డి – బ్లాక్ పార్కును, కాంపౌండ్ వాల్ నిర్మాణం, వాకింగ్ ట్రాక్ , పచ్చదనం అభివృద్ధి పనులకు శంఖుస్థాపన చెయ్యడం జరుగుందన్నారు. ఈ పనులను రుడా అభివృద్ధి నిధులు నుంచి కేటాయించి రూ. కోటి 36 లక్షలతో చేపట్టడం జరుగుతున్నట్లు షర్మిలా రెడ్డి తెలిపారు. ఆయా పనులను సాధ్యమైనంత తొందరలో పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. రుడా ఆధ్వర్యంలో వివిధ నియోజక వర్గాలలో అభివృద్ధి పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని షర్మిలా రెడ్డి తెలియచేశారు.ఈ కార్యక్రమంలో రుడా వైస్-చైర్ పర్సన్ బి. బాలస్వామి, రుడా సెక్రటరీ శైలజవల్లి , రుడా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. చంద్రశేఖర రావు, ఏఈ దుర్గాప్రసాద్, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు స్థానికులు పాల్గోన్నారు.
Prajavartha Online Telugu News