రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
సమ్మర్ స్పెషల్ రివిజన్ 2024 లో భాగంగా ప్రతి ఒక్క ఇంటిని బూత్ స్థాయి అధికారులు సందర్శించి ఓటర్ ను గుర్తించాలని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత స్పష్టం చేశారు.శనివారం ఉదయం పల్ల కడియం గ్రామ పంచాయితీలో బి ఎల్ వో ఓటరు గుర్తింపు ఇంటింటి సర్వే ప్రక్రియను ఆర్డీవో చైత్ర వర్షిణి తో కలిసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలుపుతూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడం లో బి ఎల్ వో లుకీలక పాత్ర పోషించాలన్నారు. ఇంటింటికి తిరిగి ఓటరును గుర్తించి, వాస్తవంగా ఆ గృహంలో లేకపోతే ఫారం -8 ద్వారా మార్పులు, చేర్పులు చెయ్యాలని స్పష్టం చేశారు. 2024 లో సాధారణ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్క ఓటరును ఇంటింటికీ తిరిగి గుర్తించాలని ఎన్నికల కమిషన్ స్పష్టమయిన ఆదేశాల నేపథ్యంలో నెల రోజుల పాటు ఈ ప్రక్రియ చేపట్టి నట్లు తెలిపారు. కొత్త ఓటర్ల నుంచి ఫారం -6 ద్వారా డిజిటలైజేషన్ ద్వారా నమోదు చెయ్యడం పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆగస్ట్ 21 వరకు ఇంటింటి సర్వే చేపట్టనున్న దృష్ట్యా మిగిలిన ఓటర్ల గుర్తింపు వేగవంతం చేసి, నూరుశాతం పూర్తి చెయ్యాలని మాధవీలత పేర్కొన్నారు. అనంతరం సచివాలయంలో ఓటరు జాబితా సవరణ మేరకు ఇంటింటి ఓటరు గుర్తింపు లో భాగంగా ఓటరు చేర్పిక, తొలగింపు డిజిటలైజేషన్ ను పరిశీలించారు.కలెక్టర్ వెంట ఆర్డీవో ఎ. చైత్ర వర్షిణి, తహశీల్దార్ పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News