Breaking News

సత్వర అభివృద్ది కొరకు నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాలు..

– క్షేత్ర స్థాయిలో పరిష్కారం అయ్యే సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించాలి..
-జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
నవరత్నాల్లో భాగంగా ప్రభుత్వ పధకాల ప్రయోజనాలను, అభివృద్ది పనులు పారదర్శకంగా నియోజకవర్గ స్థాయిలో అమలు తీరును సమీక్షించడం జరుగుతోందని జిల్లా ఇంచార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సీనీమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.శనివారం స్థానిక కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో రాజానగరం నియోజక వర్గ స్థాయి , జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం స్థాయి జిల్లా, నియోజక వర్గ, మండల స్థాయి అధికారులతో సంక్షేమ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యేలు జక్కంపూడి రాజా, జ్యోతుల చంటిబాబు, ఎంపి మార్గాని భరత్ రామ్, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, ఇతర అధికారులు, ఆయా నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశంలో 10 అంశాల అజెండా అంశాలుగా ఉపాధిహామీ, విద్య ప్రాధాన్యత భవనాలు, హౌసింగ్, ఇండ్ల స్థలాలు, ఏపి టిడ్కో, వ్యవసాయ అనుబంధ రంగాలు, జలవనరులు, వైద్య ఆరోగ్యం, ఆర్డబ్ల్యూఎస్ – జల జీవన్ మిషన్, పౌర సరఫరాలు పై సమీక్ష నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమాంతరంరంగా ప్రజలకు చేరువ చెయ్యాలనే దృక్పధంతో గ్రామ స్థాయిలోనే సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను ప్రవేశపట్టామన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లాలో స్థాయి వరకూ ఏ ఒక్క పధకం పెండింగ్ లో ఉండకుండా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహనరెడ్డి నూతన వరఒడికి శ్రీకారం చుట్టి ప్రజలకు అందించేందుకు గాను నియోజక వర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కొరకు జిల్లాలో స్థాయిలో చేపట్టాల్సిన వాటిని వెంటనే మంజూరు చేస్తామని, 15 రోజుల అనంతరం వాటి పై సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఆనాటికి నివేదికలు అందించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో మంజూరు చేయాల్సి ఉంటే ప్రతిపాధనలు ప్రభత్వానికి పంపి తగు చర్యలు చేపపడతామన్నారు. కొన్ని సమస్యలు మండలస్థాయిలోపరిష్కారం అవుతాని అధికారులు వాటిపై దృష్టి సారిస్తే మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయన్నారు.అభివృద్ధి సమాంతరంగా ప్రజలకు చేరవేయడంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కీలక పాత్ర పోషించ వలసి ఉందని జిల్లా కలెక్టర్ కె. మాధవీలత పేర్కొన్నారు. జిల్లాలో ప్రాధాన్యత భవన నిర్మాణ పురోగతి సాధించడంలో మెరుగైన పనితీరు చూపడం అభినందనీయం అన్నారు. ఈ స్థాయి లో భవనాలు నిర్మించడం పట్ల ప్రజా ప్రతినిధులను, అధికారులను అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు . ఈరోజు నిర్వహించిన సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతి అంశంపై 15 రోజుల తదుపరి ఆక్షన్ టేకెన్ రిపోర్ట్ సమీక్ష నిర్వహిస్తానని పేర్కొన్నారు. ప్రభుత్వం నియోజక వర్గ స్థాయి సమావేశం నిర్వహించే లక్ష్య సాధనకు కృషి చెయ్యాలని పేర్కొన్నారు. వై ఎస్ ఆర్ హెల్త్ క్లినిక్ లో పనిచేసే డాక్టర్లు ఖచ్చితంగా ఆయా కేంద్రాలలో నివాసం ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి నియోజక వర్గ స్థాయి సమావేశంలో గౌరవ శాసన సభ్యులు ఇదే అంశంపై అడగడం జరుగుతోందని అన్నారు. అదే విధంగా పూర్తి చేసిన భవనాలు తక్షణం స్వాధీన పరచుకుని నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మంగళవారం పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్, వైద్య అధికారులు స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నియోజకవర్గ స్థాయిలో గుర్తించిన పనుల ప్రతిపాధనలను సాధ్యమైనంద త్వరలో అందించాలని ఆమేరకు నిధులు విడుదలకు చర్యలు చేపట్టి ఆయా పనులను పూర్తి చేసేందుకుసాధ్యమౌతుందన్నారు.యంపీ మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ ఆయా నియోజకవర్గాల స్థాయిలో పెండింగ్ పనుల వివరాలను అందిస్తే వాటి పురోగతిపై నిధులు మంజూరు చేయడంతో పాటు ఆ పనుల సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావలసిన నిధులు విడుదలకు ప్రత్యక శ్రద్ద తీసుకోవడం జరుగుతోందన్నారు. నియోజకవర్గ సమీక్షలు ద్వారా గ్రామాల్లో వేగవంతంగా అభివృద్ది కార్యక్రమాల ప్రయోజనం ప్రజలకు చేరువ అవుతుందని యంపీ భరత్ రామ్పేర్కొన్నారు.శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో 90 శాతం పైగా ప్రాధాన్యతా భవనాలు పూర్తి చేశామన్నారు. అదేక్రమంలో డిజిటల్ లైబ్రరీల భవనాలు కూడా నిర్మాణాలు చేపట్టేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్థలాలను గుర్తించామని,పాలనా పరమైన ఆమోదం, నిధులు విడుదలపై చర్యలు తీసుకుంటే అతి త్వరగా వాటి నిర్మాణాలు చేపడతామన్నారు. పూర్తయిన వై ఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ భవనాలు వైద్య ఆరోగ్య శాఖకు అప్పగించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సంబంధిత హెల్త్ సెంటర్ కు సంబంధించి వైద్యులు, సిబ్బంది, అక్కడే వుండి విధులు నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ ప్రాధాన్యతా భవనాలు, రహదారులు నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కూడిన విధంగా నిర్మిస్తున్నామని,సంబందిత అధికారులు తప్పనిసరిగా వ్యక్తిగత పర్యవేక్షణ చేయాలన్నారు. మెట్ట ప్రాంతంలో అధిక సంఖ్యలో వ్యవసాయం చేసే కౌలురైతులు ఉన్నారని వీరందరికీ సకాలంలో బ్యాంకు రుణాలను అందజేయాలన్నారు. ఈ – క్రాఫ్ నమోదు ఇకేవైసీ పురోగతిలో ఉన్నాయని వ్యవసాయఅధికారులు శాసనసభ్యులకు వివరించారు. గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా స్థానికంగా చేపటటిన పనులు ఆలస్యానికి తావు లేకుండా నిర్ణీత కాలవ్యవధి లో పూర్తి చేయాలని శాసనసభ్యులు పేర్కొన్నారు. నియోజకవర్గ స్థాయిలో బల్కమిల్క్ యూనిట్ల ఏర్పాటు చేయడం జరిగిందని సమన్వయ శాఖల ఆధ్వర్యంలో పాల సేకరణ గ్రామ స్థాయి నుంచి చేపట్టే విధంగా కార్యచరణ ప్రణాళికను సిద్దం చేయాలన్నారు. నియోజకవర్గం లో ఆర్ డబ్యూ ఎస్ ద్వారా జలజీవన్ మిషన్ క్రింద చేపట్టే రు. 2 కోట్లు పనులు వరకు జిల్లాలో స్థాయిలోనే మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు కు సూచించారు. ఈ అంశం పై కలెక్టర్ స్పందిస్తూ సంబందిత శాఖల అధికారులు ప్రతిప్రాదనలు పంపిస్తే మార్గదర్శకాల మేరకు ఆమోదిస్తామన్నారు. నియోజకవర్గ పరిధిలో ఇరిగేషన్ పనులకు ప్రాధాన్యనిస్తూ వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది లేకుండా చూడాలని జక్కంపూడి రాజా సమీక్షలో అధికారులకు సూచించారు. జగనన్న హౌసింగ్ కాలనీలో లబ్దిదారులు ఇల్లు నిర్మించుకునేందుకు సిద్దంగా ఉన్నారన్నారని, కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం చేయాలన్నారు. ఉపాధిహామీ పనుల కు మరింత ప్రాధాన్యతను ఇవ్వాలని శాసనసభ్యులు కోరారు.జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ గోకవరం 17 ఎకరాల్లో ఇండ్ల స్థలాలు ఒకే చోట ఇచ్చేలా చూడాలనీ, డిగ్రీ కళాశాల ఏర్పాటు చెయ్యాలని కోరారు. ఆర్ అండ్ ఆర్ లో నిర్వాశితులకు గోకవరం గ్రామ పంచాయతి లో విలీనం అయిన వారికి తగిన సౌకర్యాలు కల్పించ్చాలన్నారు. త్రాగునీరు, విద్యుత్ కోతలు, ఆక్రమిత ప్రభుత్వ స్థలాల్లో ఇండ్ల నిర్మాణాల చేపట్టిన వారికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కోరారు. శాసనసభ్యుల సూచనలు మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పందిస్తూ ఇళ్ల స్థలాల కొరకు గోకవరంలో ఇప్పటికే 17 ఎకరాలు భూసేకరణ చేయడం జరిగిందన్నారు. ఆర్ అండ్ ఆర్ నిర్వాశితులకు గోకవరం లో పంచాయితీలో ఇళ్ల స్థలాలు మౌలిక సదుపాయలు కల్పించామన్నారు. వైఎస్ఆర్ జలకళ లో భాగంగా జిల్లా కు 20 మోటార్లు వచ్చాయని, ఇందులో గోకవరం కు 2 మోటార్లు మంజూరు చేశామన్నారు. మిగిలినవి త్వరలో అందిస్తామన్నారు.సమావేశంలో జాయింట్ కలెక్టరు ఎన్. తేజ్ భరత్, డీఆర్వో జి. నరశింహులు ఆర్డీఓ ఏ. చైత్రవర్షిణి, సిపివో ఏ. ముఖ లింగం, డి ఎస్ వో పి. విజయ భాస్కర్, డి ఎం మార్కెటింగ్ ఏ.కుమార్, మార్కెటింగ్ ఏ డీ ఏం.సునీల్ వినయ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి, కే ఎస్ జ్యోతి, బీసీ వెల్పేర్ అధికారి, ఎస్. రమేష్, పీడీ డ్వామా పి. జగదాంబ, డా సత్య గోవింద్, డియంహెచ్ ఓ డా. కే. వెంకటేశ్వరరావు, డీసీహెచ్ ఎస్ డా. ఎన్.సనత్ కుమారి, డీఈవో ఎస్. అబ్రహం తదితర జిల్లా అధికారులు, ఆయా నియోజకవర్గాల స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *