గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య పనుల్లో నిర్లక్ష్యంగా ఉండే అధికారులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని, నూరు శాతం ఇంటింటి చెత్త సేకరణ జరగాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. సోమవారం కమిషనర్ జాకీర్ హుస్సేన్ నగర్, వినోభా నగర్, శీలంవారి వీధి, బాలజి నగర్, ఎల్.బి.నగర్, లాలాపేట, పట్నం బజార్ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య పనులను ఆకస్మిక తనిఖీ చేసి ప్రజారోగ్య అధికారులకు, శానిటేషన్ కార్యదర్శులకు తగు ఆదేశాలు జరీ చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ తొలుత జాకీర్ హుస్సేన్ నగర్ లో ఈ-ఆటో ద్వారా ఇంటింటి చెత్త సేకరణను నేరుగా పరిశీలించి, ఆటో ద్వారా ఎన్ని గంటలకు చెత్త సేకరణ ప్రారంభిస్తుంది, ఎంత సమయానికి పూర్తి అవుతుంది శానిటేషన్ కార్యదర్శులను, ఇంటింటికి ఏ సమయానికి చెత్త సేకరణ కోసం వస్తుంది స్థానిక ప్రజలను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ ఈ-ఆటో ప్రతి రోజు నిర్దేశిత సమయంలోనే డోర్ టు డోర్ చెత్త సేకరణకు వెళ్లాలని, కేటాయించిన ఇళ్ళ నుండి నూరు శాతం చెత్త సేకరణ జరగాలన్నారు. ఆటో డంపింగ్ పాయింట్ లో అన్ లోడ్ చేసే సమయం తగ్గేలా యార్డ్ లో ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. ఆటో వెంబడి కార్యదర్శి ఉండి ప్రజలకు తడిపొడి వేరుగా వ్యర్ధాలు ఇవ్వాలని, రోడ్ల మీద, కాల్వల్లో వేయకూడదని అవగాహన కల్గించాలని ఆదేశించారు. కార్యదర్శులు తప్పనిసరిగా మస్టర్ సమయానికి విధుల్లో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండే వారి పై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉదయం ఇళ్లల్లో చెత్త సేకరణ అయ్యాక మధ్యాహ్నం గ్యాంగ్ వర్క్ ద్వారా డివిజన్లో సమస్యాత్మక ప్రాంతాల శుభ్రం చేయించాలని, గ్యాంగ్ వర్క్ షెడ్యుల్, కార్యదర్శుల, కార్మికుల హాజరు ప్రతి రోజు తమకు పంపాలని ఎంహెచ్ఓని ఆదేశించారు. లాలాపేటలో పలు ప్రాంతాల్లో 10 గంటల తర్వాత కూడా చెత్త కుప్పలు ఉండడంపై శానిటరీ ఇన్స్పెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే తొలగించాలని, వాహనాలు అవసరమైతే వెహికిల్ షెడ్ ఏ.ఈ.తో సమన్వయం చేసుకోవాలన్నారు.పర్యటనలో కార్పొరేటర్ మహమూద్, ఎంహెచ్ఓ డాక్టర్ భాను ప్రకాష్, ఎస్.ఎస్. రాంబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్లు ఎం.ఐజాక్, డి.ప్రసాద్, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News