-ఆర్ ఎం సి కమిషనర్ కె.దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పరిధిలోని పార్కులను ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంరక్షించు కోవాలని నగరపాలక సంస్థ కమిషనరు కె.దినేష్ కుమార్ పిలుపు నిచ్చారు.సోమవారం ఉదయం స్వచ్ఛతా హి సేవా మరియు ఇండియన్ స్వచ్ఛతా లీగ్ 2.0 కార్యక్రమంలో భాగంగా నగరంలోని పార్కులన్నీ శుభ్రం చేసే కార్యక్రమాన్ని రెసిడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, సచివాలయ సిబ్బంది, విద్యార్ధులతో కలిసి కమిషనర్ చేపట్టారు.ఈ సందర్భముగా కమిషనర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ ఆర్ ఎం సి పరిధిలో పలు ప్రాంతాలను, పార్కులను కోట్లది రూపాయల వ్యయంతో అభివృద్ది చేస్తున్నామని పేర్కొన్నారు . వాటిని సక్రమంగా నిర్వహించడం తద్వారా వినియోగించుకోవాలని అన్నారు. నగరంలో దాదాపు అన్ని పార్కులకు వాకర్స్ అసోసియేషన్స్ ఏర్పడ్డాయిన తెలిపారు. వారు ఎప్పటికప్పుడు పార్కులలోని సమస్యలను తమ దృష్టికి తేవాలని, అలాగే స్వచ్ఛందంగా భాగస్వామ్యం అవుతూ పార్కులను శుభ్రం చేసుకావాలని తెలియచేసారు. ప్రజా భాగస్వామ్యంతో పార్కుల సక్రమ నిర్వహణ సాధ్యమవు తుందన్నారు. రాత్రి పూట అసాంఘిక శక్తులు పార్కులోకి రాకుండా దృష్టి సారించాలని కోరారు. ఈ విషయంలో పోలీసు వారి సహకారం కూడా కోరడం జరుగుతుందని అన్నారు. నగరంలో అన్ని పార్కులలో పరిశుభ్రత పరిరక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలియచేసారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డా.ఎ.వినూత్న, శానిటరీ సూపర్వైజర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, విద్యార్ధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News