Breaking News

గంటలో ట్రాన్స్ జెండర్ గా గుర్తింపు ధ్రువ పత్రం, గుర్తింపు కార్డు జారీ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం స్పందన కార్యక్రమంలో గోకవరం మండలం వీరలంకపల్లి కి చెందిన ట్రాన్స్ జెండర్ పైడికొండల రమేష్ ఉరఫ్ (పైడికొండల వసుంధర) తనకు ట్రాన్స్ జెండర్ గా గుర్తించే ధ్రువపత్రం, గుర్తింపు కార్డు జారీ చేయవలసినదిగా స్పందనలో కలెక్టర్ డా కె. మాధవీలత కు అర్జీ అందచేశారు.వెంటనే స్పందించిన కలెక్టర్ విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి. రామ్ కుమార్ ను తక్షణం గుర్తింపు కార్డు జారీ చేయవలసినదిగా ఆదేశించడం జరిగింది. ఇందుకు సంబందించిన గంట వ్యవధిలోనే సంబంధిత ధ్రువపత్రాలు జారీ చేయడంతో కలెక్టర్ చేతుల మీదుగా గుర్తింపు కార్డు అందజేయడం జరిగింది. ఈ సందర్భంలో పైడికొండల రమేష్ ఉరఫ్ పైడికొండల వసుంధర కలెక్టర్ కు అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉండి, తక్షణం పరిష్కారం చేసే అర్జీల విషయంలో కాలయాపన చెయ్యకుండా సాధ్యమైనంత వేగంగా పౌర సేవలు అందించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *