Breaking News

జిల్లాలో జగనన్న చేదోడు గా జిల్లాలోని 13473 మంది లబ్ధిదారుల ఖాతాకు రూ.13.47 కోట్లు జమ..

– జిల్లా కలెక్టర్ డా. మాధవీలత.
– కుల వృత్తులు వారికి జగనన్న ప్రభుత్వం అండగా నిలిచింది.
– ఎంపి మార్గని భరత్ రామ్

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న చేదోడు పథకం క్రింద కుల వృత్తులు చేసుకునే రజక, నాయీ బ్రాహ్మణులు, టైలర్లు వృత్తి వారాలకు వరుసగా 4 వ విడతల్లో ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం అండగా నిచిందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత ఎంపి మార్గని భరత్ రామ్ లు పేర్కొన్నారు. గురువారం జగనన్న చేదోడు రాష్ట్రస్థాయి కార్యక్రమం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు లో జరిగే బహిరంగ సభలో బటన్ నొక్కి రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నాల్గవ విడత ఆర్థిక సహాయాన్ని జమ చేయగా, స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఎంపి తో పాటు రాష్ట్ర గాండ్ల తెలుకుల దేలతిలకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సంకిస భవాని ప్రియ, మాజీ రుడా చైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జగన్న చేదోడు పథకం క్రింద దర్జీలు, రజకులు, నాయీ బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 13473 మంది లబ్దిదారుల కు రు.13.47 కోట్ల సహాయాన్ని ప్రభుత్వం వారి ఖాతాలకు జమ చేసిందన్నారు. కుల వృత్తులు చేసుకునే కుటుంబాలకు నేరుగా ఆర్థిక సహాయం వారి బ్యాంకు ఖాతాలకు ఎటువంటి మధ్య వర్తులు లేకుండా వారి ఖాతాలోకి జమ చేస్తున్నట్లు తెలిపారు. ఈ మొత్తాన్ని వారి కుల వృత్తుల పెంచుకోవడం కోసం, ఆయా కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇవ్వడం జరిగిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ పథకం కింద జిల్లాలో గత మూడు విడతలుగా 35,616 మంది లబ్ధిదారులకు రూ. 35.61 కోట్లు అందజేయడం జరిగిందన్నారు. జిల్లాలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో 12181మంది లబ్ధిదారులకు రూ.12.18 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9944 మంది లబ్ధిదారులకు రూ.9.94 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో 13491 మంది లబ్దిదారులుకు రూ. 13.47 కోట్ల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లోకి నేరకు ప్రభుత్వం జమచేయడం జరిగిందని కలెక్టరు పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న చేదోడు పథకం కింద గత నాలుగు విడతలుగా లబ్ధిదారులకు రూ.1,252.52 కోట్లు వారి ఖాతాలకు జమచేసమామన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంకు సంబంధించి ఈ ఏడాది నాల్గవ విడతగా రాష్ట్ర వ్యాప్తంగా 3,25,020 మంది లబ్ధిదారులకు రూ. 325.02 కోట్లు రూపాయాలు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న చేదోడు లబ్దిదారుల ఖాతాల్లో ఆర్థిక సహాయాన్ని జమ చేశారన్నాని పేర్కొన్నారు. షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, టైలర్లకు ఇప్పటివరకు ఒక్కొక్కరికి రు.10 వేలు చొప్పున నాలుగు విడతల్లో రూ. 40,000 వరకు ఆర్థిక సాయం,ప్రభుత్వం అందించింది. లంచాలకు, వివక్షకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా, గ్రామ/వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితా డిస్ ప్లే చేసి, సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ అర్హత ఉంటే మిస్ కాకుండా సాయం అందించడం జరుగుతుందన్నారు. అర్హులై ఉండి పొరపాటున, ఏ కారణం చేతనైనా సంక్షేమ పథకాల లబ్ధి అందని వారికి కూడా మరో అవకాశం కల్పిస్తూ జూన్, డిసెంబర్ లలో లబ్ధిని అందజేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర గాండ్ల తెలుకుల దేలతిలకుల కార్పొరేషన్ చైర్ పర్సన్ సంకిస భవాని ప్రియ, మాజీ రూడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిల, జిల్లా బి సి సంక్షేమ అధికారి పి. సత్య రమేష్, పలువురు లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *