Breaking News

 సంస్కరణలో భాగంగా  వాలంటరీ, సచివాలయ వ్యవస్థ

-గ్రామస్థాయిలోనే ప్రభుత్వ పథకాల అందిస్తున్నాం
– మంత్రి వేణుగోపాలకృష్ణ.

కడియం , నేటి పత్రిక ప్రజావార్త :
పౌర సేవలను సచివాలయ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే చేరుస్తున్నాం అందిస్తూ, ప్రజాసేవయే లక్ష్యంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చి ప్రజా మన్నునులు పొందిన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది కదా గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిర్వచనం అని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి మంత్రి వేణుగోపాలకృష్ణ మంగళవారం కడియం వెంకాయమ్మ పేటలో పర్యటించారు. ఈ సంధర్భంగా మంత్రి వేణు గోపాల్ కృష్ణ మాట్లాడుతూ, అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను డిబిటి ద్వారా నేరుగా వారు బ్యాంకు ఖాతాలకే జమ చేయడం జరిగిందన్నారు. పాలన సంస్కరణలో భాగంగా వాలంటరీ వ్యవస్థ, సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను నేరుగా ప్రజల వద్దకే అందించడం సీఎం జగన్మోహన్ రెడ్డి కే సాధ్యమైందని ఆన్నారు. ఈ సందర్భంగా వెంకాయమ్మ పేట లోని సచివాలయం-4 సందర్శించా మాన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ మే లక్ష్యంగా నేరుగా ప్రజల వద్దకే పాలన తీసుకొను వచ్చారని పేర్కొన్నారు. సంస్కరణ లో భాగంగా వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడంతో మండల స్థాయి లో జరగవలసిన పనులు గ్రామస్థాయిలోనే పరిష్కరి స్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 1959లో బలవంతరాయ్ కమిటీ పంచాయతీరాజ్ సంస్కరణ ప్రవేశపెడితే, 1985లో మండల వ్యవస్థ ఏర్పడిందన్నారు. గాంధీజీ కోరుకున్న గ్రామ స్వరాజ్య స్థాపనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా అమలు చేస్తూ పాలన వ్యవస్థను గ్రామీణ స్థాయికి తీసుకువచ్చి ప్రజా మన్ననలు పొందుతున్నారని పేర్కొన్నారు. ప్రజా అవసరాలు తెలుసు కోవడానికి వాలంటరీ వ్యవస్థ, తెలుసుకున్న సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు సచివాలయ వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను అర్హులైన లబ్ధిదారులందరుకు నేరుగా డి బి టి ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇది కదా గ్రామ స్వరాజ్యానికి నిజమైన నిర్వచనం అని మంత్రి పేర్కొన్నారు. 73వ రాజ్యాంగ సవరణ జరిగిన తర్వాత కూడా ప్రజలకు వాటి యొక్క ఫలాలు అందలేదని నాటి ప్రధానమంత్రి స్వయంగా పేర్కొన్నారని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పౌర జీవనానికి అందిస్తున్న సేవలు పాలన సంస్కరణలో భాగంగా సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాసేవ లక్ష్యం గా వ్యవస్థలు సృష్టించే నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసి పాలన సాగిస్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి నాడు ప్రజలకు వాగ్దానం చేసిన మాటనే నిజం చేస్తూ చరిత్రలో నిలిచారని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం గ్రామ స్వచ్ఛత పరిశుభ్రతకు ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. గ్రామాలు స్వచ్ఛతే లక్ష్యంగా గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి నిర్వచనం చెబుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. గ్రామ ఆరోగ్య రక్షకుడు పారిశుద్ధ్య కార్మికుడని, వారి పట్ల ప్రజల్లో ప్రేమ పెరిగే విధంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం మంచి సత్ఫలితాలు నిస్తుందని స్వచ్ఛత మన అందరి బాధ్యత రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని మంత్రి వేణు స్పష్టం చేశారు. సందర్భంగా మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులతో ముచ్చటిస్తూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా విద్యార్థులు ఉన్నత చదివే లక్ష్యంగా అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీ వేన వసతి దీవేన వంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులైన చిన్నారులను మంత్రి వేణుగోపాలకృష్ణ దీవించారు. గుడ్ మార్నిగ్ కార్యక్రమంలో మంత్రి వేణు వెంట ఎంపీటీసీ అయితరెడ్డి మంగతాయారు, ఎంపీడిఓ కే. రత్న కుమారి, ఈఒపిఆర్డి వై ఎన్ ఎస్ లక్ష్మి, స్థానిక నాయకులు దాసరి శ్రీనివాస్, గండి పార్వతి పులిదండి, పులిదిండి రాజు ఊటుకూరు శైలజ,టేకు శీను, చిలుకూరి రామకృష్ణ, కడియపులంక సొసైటీ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీనివాస్, కడియం మండలం వ్యవసాయ శాఖ సలహా మండలి ఈలి గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *