-రక్తదానం ఇచ్చిన వారికి ప్రశంసా పత్రాలు అందజేత
– సి హెచ్. సంపత్ కుమార్, జిల్లా రవాణా అధికారి (ఇన్చార్జి)
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
35 వ రహదారి భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని ది:30-01-2024 న డా జక్కంపూడి. రాజశ్రీ , జక్కంపూడి రామ్మోహనరావు ఫౌండేషన్ వారి ఆధ్వర్యములో రక్త దాన శిబిరము ను నిర్వహించడం జరిగినదని, 52 మంది వరకు రక్త దానం చేశారని జిల్లా రవాణా అధికారి (ఇన్చార్జి) సి హెచ్. సంపత్ కుమార్ ఒక ప్రకటన లో తెలిపారు. మంగళవారం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రక్త దాన శిబిరాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ తప్పకుండా రక్త దానం చేసి మరొకరికి జన్మ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమములో జిల్లా రవాణా అధికారి (ఇన్చార్జి) సి హెచ్. సంపత్ కుమార్ , సహాయ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఎన్. సబితా, జి. రాధిక దేవి, కార్యాలయ పర్యవేక్షకులు ఎల్. పెన్సిన్ బాబు, జూనియర్ అససిస్టెంట్ ఎం. విజయ బాబు, జి. సాయి సుమంత్ , యితర రక్త దాన దాతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News