– వెంకాయమ్మ పేటలో స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమం పాల్గొన్న మంత్రి వేణు
-ఇంటింటికి వెళ్లి పలు ప్రజా సమస్యలు తెలుసుకున్న మంత్రి..
-సత్వర పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ
-రాష్ట్ర ప్రభుత్వం స్వచ్ఛత కూడిన పరిసరాలు పరిశుభ్రతకు పెద్దపేట వేస్తోంది
– గ్రామాల్లో కాలుష్య నివారణ అరికట్టే విధంగా చెత్తను తొలగిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం .
– పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచటం మంనందరీ సామాజిక బాధ్యత
-మురుగునీటి గుంటలను పరిశుభ్రం చేయాలని అధికారులకు ఆదేశం
-ఆరోగ్యవంతమైన సమాజం కొరకు గ్రామాల్లో మేరుగే మెరుగైన పారిశుధ్యం లక్ష్యం.
-ఇంటింటికి వెళ్లి ప్రజల ఆరోగ్య సమస్యలు తెలుసుకుంటున్న మంత్రి
-రు.2 కోట్ల 70 లక్షలతో కడియం నుండి కడియపులంక నిర్మాణంలో ఉన్న ఆర్ అండ్ బి రహదారి పనులు పరిశీలిస్తున్న..
-జిల్లా ఇంచార్జి మంత్రి వేణు గోపాలకృష్ణ
కడియం , నేటి పత్రిక ప్రజావార్త :
పారిశుధ్య కార్మికులు ఆరోగ్య రక్షకులని,ఆరోగ్యవంతమైన సమాజం కొరకు మెరుగైన పారిశుధ్యమే లక్ష్యం అని ఆదిశగా ఆ దిశగా అధికారులు అడుగులు వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమ సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మంగళవారం ఉదయం కడియం మండలం వెంకాయమ్మ పేట గ్రామంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఇన్చార్జి మంత్రి చెల్లి బోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అధికారులు స్థానిక నాయకులతో కలిసి స్వచ్ఛత అందరి బాధ్యత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ నేను పాలకుడిని కాదని మీకు సేవ చేసేందుకే రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గా సీఎం బాధ్యతలు అప్పగించారని మీకు సేవకునిగా తన వంతు కర్తవ్యాన్ని నిర్వహిస్తానని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని, ఆ దిశగా నావంతు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గుడ్ మార్నింగ్ కార్యక్రమం ద్వారా అన్ని వార్డుల్లో పర్యటిస్తూ పర్యావరణ కాలుష్యము నివారించే క్రమంలో చెత్తను తొలగిస్తూ పరిశుభ్రత దిశగా అడుగులు వేస్తున్నామన్నా మన్నారు. ఇప్పటికే ధవలేశ్వరం లో అపరిశుభ్రతగా ఉన్న డ్రైన్లు, పరిసరాలను శుభ్ర పారిచే కార్యక్రమాన్ని ద్వారా ప్రజల్లోకి వెళ్లి చైతన్యం తీసుకుని రావడానికి గత మూడు రోజులుగా పర్యటన చేపట్టడం జరిగిందన్నారు. దేశ సైనికులు దేశ రక్షణలో ఏవిధంగా విధుల్లో ఉంటారో, సమాజ పరిరక్షణ, పారిశుధ్యం కోసం అదే విధంగా పారిశుధ్య కార్మికులు పనిచేస్తూన్నట్లు తెలిపారు. మంత్రి గ్రామంలో పర్యటిస్తున్న సందర్భంలో రోడ్డు కిరువైపులా పేర్కొన్న చెత్తను వెంటనే తొలగించి, శుభ్రపరిచే విధానాన్ని ముందు.. తరువాత ఫోటోలను పంపించాలనే అధికారులు ఆదేశించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ప్రాంతాన్ని స్వచ్ఛతగా రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని హామీ వేణు మంత్రి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్న తరుణంలో వెంకయ్యమ్మ పేట గ్రామంలోని 80 సంవత్సరాలు వృద్ధుడు కొల్లి అప్పలనాయుడుతో మాట్లాడుతూ నీకు ప్రభుత్వం నుండి పెన్షన్ వస్తుందా.. క్రమం తప్పకుండా ఆరోగ్య కార్యకర్తలు మందులు అందిస్తున్నారా అని మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పలనాయుడు వివరణ ఇస్తూ నెల మొదటి రోజునే పెన్షన్ వస్తుందని, సమయానికి ఆరోగ్య కార్యకర్తలు వచ్చి మందులు నెలనెలా అందిస్తున్నా రని చాలా ఆరోగ్యంగా ఉన్నానని మంత్రి కి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాల కృష్ణ ఐఎంపి నిధులు రు.2 కోట్ల 70 లక్షల రూపాయలతో రోడ్లు భవనాలు శాఖ ద్వారా నిర్మిస్తున్న కడియం నుండి కడియపులంక రహదారి పనులను మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యవేక్షించారు. గుడ్ మార్నిగ్ కార్యక్రమంలో మంత్రి వేణు వెంట.ఎంపీటీసీ అయితరెడ్డి మంగతాయారు, ఎంపీడిఓ కే. రత్న కుమారి, ఈఒపిఆర్డి వై ఎన్ ఎస్ లక్ష్మి, స్థానిక నాయకులు దాసరి శ్రీనివాస్, గండి పార్వతి పులిదండి, పులిదిండి రాజు ఊటుకూరు శైలజ,టేకు శీను, చిలుకూరి రామకృష్ణ, కడియపు లంక సొసైటీ చైర్మన్ తిరుమల శెట్టి శ్రీనివాస్, కడియం మండలం వ్యవసాయ శాఖ సలహా మండలి ఈలి గోపాలరావు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News