Breaking News

కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి  భూముల రిజిస్ట్రేషన్, రీ సర్వే, ఇనాం అసైన్ ల్యాండ్, ఎస్ టి పి ఐ , హౌసింగ్ , వైద్య ఆరోగ్య, ఆరోగ్యశ్రీ పంచాయతి రాజ్ అంశాలపై కలెక్టర్ల తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కే . మాధవీలత ఇతర అధికారులు  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత జిల్లా ప్రగతిపై సమగ్ర నివేదికను వివరిస్తూ,  జిల్లాలో రెండో దశ ఇండ్ల నిర్మాణాల లక్ష్యం 19,253 కాగా ఇప్పటి వరకూ 6750 ఇళ్లను పూర్తి చేశామన్నారు. మిగిలిన వాటిలో సుమారు 9500 ఇళ్లు పురోగతి లో ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో 53,269 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఇంటి నిర్మాణం కోసం అదనపు రుణాలు ఇచ్చినట్లు తెలియ చేశారు.జిల్లాలో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ ఆఫ్ ఇండియా కంపెనీ ఏర్పాటు కోసం అనువైన స్థలాన్ని గుర్తించి నివేదిక అందజేస్తామని కలెక్టర్ డా కే. మాధవీలత తెలిపారు. జిల్లాలో జగనన్న ఆరోగ్య శిబిరాలు 2 వ దశలో ఇప్పటి వరకూ 138 క్యాంపులు నిర్వహించి 59 వేల మందికి వైద్య సేవలు అందించినట్లు పేర్కొన్నారు. జిల్లాలో రు.25 లక్షల వైద్య సేవలు అందించే క్రమంలో 2,17,450 మందికి ఆరోగ్యశ్రీ కార్డుల ను పంపిణీ చేశారని తెలిపారు.. ఈ సమావేశంలో వైద్యాధికారులు డా కె. వేంకటేశ్వర రావు,  డా సూర్య ప్రభ, డా ఎన్. సనత్ కుమారి, డా  పి. ప్రియాంక, డిపివో బి..రాంబాబు, డిఎల్ పివో జే . వి. సత్యనారాయణ, ఆర్ డబ్ల్యు ఎస్ డి. బాల శంకరరావు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *