Breaking News

అత్యంత వేడుకగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం

-37 మంది కి సేవా వజ్రా, 118 మందికి సేవా రత్న, 8879 మందికి సేవా మిత్ర అవార్డులు
-9,034 మంది వాలంటీర్లు కు రూ.13,83,90,000 అందచేత
-వాలంటీర్లు కు బ్యాడ్జి, మెడల్, ధృవపత్రం బాహుకరణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా లో హాజరైనా జిల్లా ఇంఛార్జి మంత్రి వేణు గోపాల్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, జేసీ తేజ్ భరత్
వాలంటీర్లకు వందనం పేరుతో గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లను సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించిందనీ ఆమేరకు జిల్లాలో,9.034 మంది వాలంటీర్లను సన్మానించి నట్లు జిల్లా ఇంఛార్జి మంత్రి, రాష్ట్ర బిసి సంక్షేమ, సమాచార పౌర సంబంధాల సినిమాటోగ్రఫి శాఖ మంత్రి చెల్లు బోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారము స్ధానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో వాలంటీర్లు కు వందనం కార్యక్రమం కు ముఖ్య అతిథిగా మంత్రి వేణు గోపాల్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ షర్మిలా రెడ్డి, జేసీ తేజ్ భరత్, డీఎల్ డి వో వి. శాంత మణి లు హాజరయ్యారు. ఈ సందర్బంగా మంత్రి వేణు గోపాల కృష్ణ మాట్లడుతూ, జగనన్న మానస పుత్రికలు వాలంటీర్లు అన్నారు. వాలంటీర్లు వ్యవస్థ ప్రపంచం మెచ్చుకున్న గొప్ప వ్యవస్థ ఈ ఆలోచన ద్వారా అర్హులకు సంక్షేమ పథకాలు సకాలంలో అందించడం సాధ్యం చేశారన్నారు. నెహ్రూ ఆశించిన మేరకు పంచాయతీ రాజ్ వ్యవస్థ ద్వారా సేవలు అందించడం జరుగలేదు… అయితే జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశారు.  పేద వాడి జీవితం పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో డి బి టి ద్వారా నేరుగా ప్రభుత్వము అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడం జరిగిందనీ అన్నారు. స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకుని రావడం జరిగిందని అన్నారు. ఏ ప్రభుత్వ లక్ష్యమైన పేద వాడు ఉన్నతంగా ఉండాలన్నదే..  ఆమేరకు వాలంటీర్లు వ్యవస్థ తీసుకుని రావడం జరిగింది. రాష్ట్రంలో అత్యంత గౌరవించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాలంటరీ వ్యవస్థ అన్నారు. ఈ రొజు గుంటూర్ జిల్లా పిరంగిపురంలో . వై. యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించరనీ తెలిపారు. రాబోయే వారన్ రోజులూ నియోజకవర్గం స్థాయి లో సన్మాన కార్యక్రమం ప్రజా ప్రతినిధులు సమక్షంలో నిర్వహిస్తారనీ తెలిపారు. రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్ పర్సన్ మేడపాటీ షర్మిలా రెడ్డి మాట్లడుతూ, అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వివిధ సంక్షేమ పథకాలు అమలులో వారధులు నిలుస్తున్న సేవా లందిస్తున్నట్లు తెలిపారు. గ్రామ మరియు వార్డ్ వాలంటీర్లను సత్కరించే కార్యక్రమం వాలంటీర్లకు వందనం పేరుతో ప్రభుత్వం గౌరవించ డం జరుగుతున్నట్లు తెలిపారు.ముఖ్యమంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మూడు నెలల వ్యవధిలోనే 2019 ఆగస్ట్ 15వ తేదిన వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశ పెట్టడం జరిగిందన్నారు. నియోజకవర్గ స్థాయి లో 5 గురు వాలంటీర్లకు సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేసి నగదు రూపంలో రూ.45 వేలు చొప్పున, మండల మరియు మున్సిపాలిటీలలో 15 మంది వాలంటీర్లకు సేవా రత్న అవార్డులతో పాటు రూ.30 వేలు మరియు మిగిలిన వాలంటీర్లలందరికి సేవమిత్ర అవార్డు నగదు రూపంలో రూ.15 వేలు అందించడం జరిగిందన్నారు. జిల్లాలో సేవా వజ్ర 2. సేవా రత్న 3. సేవా మిత్ర అవార్డ్ కింద 9034 మంది వాలంటీర్లను అభినందన కార్యక్రమము నిర్వహించామని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ తెలిపారు.అందులో సేవా వజ్ర 37 మందికి రూ. 45,000 చొప్పున రూ.1,66,5000 , సేవా రత్న 118 మందికి రూ.30,000 చొప్పున రూ. 35,40,000 మరియు సేవా మిత్ర క్రింద 8879 మందికి రూ.15,000 చొప్పున రూ.13,31,85,000 వెరసి రూ.13,83,90,000 అందజేస్తున్నా మన్నారు. నియోజక వర్గం వారీగా …అనపర్తి నియోజన వర్గంలో సేవా మిత్రా లు 1237, సేవా రత్న 15 , సేవా వజ్ర 5 , రాజానగరం లో సేవా మిత్రా 1424 , సేవా రత్న 16 , సే సేవా వజ్ర 5 , రాజమహేంద్రవరం అర్బన్ సేవా మిత్రా 1494 , సేవా రత్న 14 , సేవా వజ్ర 6 , రాజమహేంద్రవరం రూరల్ సేవా మిత్రా 1342 , సేవా రత్న 13 , సేవా వజ్ర 4 , కొవ్వూరు లో సేవా మిత్రా 971 , సేవా రత్న 20 , సేవా వజ్ర 5 , గోపాలపురం లో సేవా మిత్రా 902 , సేవా రత్న 15 , సేవా వజ్ర
5 , నిడదవోలు లో సేవా మిత్రా 1239 , సేవా రత్న 20 , సేవా వజ్ర 5 , గోకవరం (జగ్గంపేట నియోజకవర్గం) సేవా మిత్రా 270 , సేవా రత్న 5 , సేవా వజ్ర 2 అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమ నిర్వహణ లో భాగంగా మంత్రి, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు చేతుల మీదుగా సేవా మిత్ర,కె.సాయి శివకృష్ణ, సేవా మిత్ర, పి పద్మిని, సిహెచ్. కిషోర్ బాబు, సేవా వజ్ర, ఆర్ సత్య దుర్గ, సేవా వజ్ర, చంద్ర ప్రశాంతి, సేవ వజ్ర, వి.అశ్విని లను సన్మానించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *