Breaking News

నగరంలో రాజమహేంద్రవరంలో రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు వేడుకలు

-రోడ్డు భద్రత పై ప్రతీ ఒక్కరికీ అవగాహన కల్పించడం ముఖ్యం
-ముఖ్య అతిథిగా హాజరైన డిఎల్ఎస్ఎ కార్యదర్శి ప్రత్యూష కుమారి
-గురువారం ఉదయం రాజమహేంద్రవరం ఆర్టీసి డిపో గ్యారేజీ నందు రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు సభ నిర్వహించారు.

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగాహాజరైన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి  ప్రత్యూష కుమారీ , ఆర్టీసి జిల్లా ప్రజా రవాణా అధికారి కే. షర్మిలా అశోక్ , మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎమ్.సంపత్ కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రజా రవాణా అధికారిని కే. షర్మిల అశోక అధ్యక్షత వహించారు. సభలోజిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రెటరీ మరియు సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి ప్రత్యూష కుమారి మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది పెద్ద వాహనాలను నడిపే డ్రైవర్లదే బాధ్యత కాదని, పాదచారుల నుండి సైకిలు, ద్విచక్ర వాహనములు, కారులు మొదలగు వారిపై కూడా ఉందన్నారు. రోడ్డును ఉపయోగించే ప్రతి ఒక్కరిది బాధ్యతే అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు సంకేతాలు, నియమ నిబంధనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉంటే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చననీ పేర్కొన్నారు. ఇది మన అందరి సామాజిక బాధ్యత అని మరియు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను తెలియజేస్తూ సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సభలో తూర్పుగోదావరి జిల్లాలోని నాలుగు రాజమహేంద్రవరం, కొవ్వూరు, నిడదవోలు, గోకవరం డిపోలకు సంబంధించిన ప్రమాద రహిత డ్రైవర్లను ఎంపిక చేసి, మొత్తం 15 మంది డ్రైవర్లను నగదు బహుమతి తో పాటు శాలువ, ప్రశంసా పత్రాలతో కుటుంబ సభ్యులతో సహా సన్మానించడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా ఆయా డిపోల పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత పై అవగాహన కల్పించే నిమిత్తం డ్రాయింగ్ పోటీలను పెట్టి జిల్లా వ్యాప్తంగా 24 మంది విద్యార్థులను ఎంపిక చేసి ఈ ముగింపు సభ నందు వారికి బహుమతులను ఇచ్చి సత్కరించడం జరిగింది. ఈ బహుమతు లను సీనియర్ జడ్జి, డి పి టి వో షర్మిలా అశోక్, ఎమ్ వి ఐ ఎమ్.సంపత్ కుమార్ ల చేతుల మీదుగా అందజేయడం జరిగింది. జిల్లా పరిధిలో ఎంపిక కాబడిన డ్రైవర్లు: ఎమ్ వి రావు, కొవ్వూరు డిపో-నగదు బహుమతి రూ’ 1500/- పీవీ చలం, గోకవరం డిపో-నగదు బహుమతి రూ’ 1250/- డి.వి. రావు, రాజమహేంద్రవరం డిపో- నగదు బహుమతి రూ’ 1000/- లను అందచేశారు. అదేవిధంగా.డిపో పరిధిలోని డ్రైవర్లకు రూ’ 1000/-, 750/-, 500/- చొప్పున నగదు బహుమతులు ఇవ్వడమైనది. ఈ సభలో పై నాలుగు డిపోల డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *